Rajamouli's RRR Janani Song didn't mesmariseజనవరి 7వ తేదీన విడుదల కాబోతున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో, అన్ని భాషల ప్రమోషన్స్ ను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన భుజ స్కంధాలపై వేసుకుని తిరుగుతున్నారు. అందులో భాగంగా తాజాగా ‘జనని’ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇద్దరు హీరోల హావభావాలు – అద్భుతమైన విజువల్స్ – ఎమోషనల్ కంటెంట్ – అంతకు మించి రాజమౌళి మార్క్ టేకింగ్ తో ‘జనని’ పాట నిండిపోయింది. కానీ ఈ సినిమా కోసం నిరీక్షిస్తున్న సినీ ప్రేక్షకులకు ‘వావ్’ అనిపించే ‘కిక్’ను మాత్రం ‘జనని’ పంచలేకపోయింది. దీంతో “ఆర్ఆర్ఆర్” ధియేటిరికల్ ట్రైలర్ పైనే అందరి చూపులు!

ఇప్పటివరకు రిలీజ్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ మెటీరియల్ లో ఒక్క టీజర్ మాత్రమే ప్రేక్షకులకు కావాల్సిన హైప్ ను తీసుకువచ్చింది. డిసెంబర్ 3వ తేదీన రిలీజ్ కాబోయే ట్రైలర్ ఈ సినిమా ఓపెనింగ్స్ కు అత్యంత కీలకం కానుంది. ట్రైలర్ తో జక్కన్న ‘స్పెల్ బౌండ్’ చేయబోతున్నారు ఇండస్ట్రీ టాక్. లెట్స్ వెయిట్!