Rajamouli, Rajamouli Jyo Achyutananda, Rajamouli Speech Jyo Achyutananda Audio, Rajamouli Speech Jyo Achyutananda Audio Launch, Rajamouli Speech Jyo Achyutananda Audio Release, Director Rajamouli Speech Jyo Achyutananda Audio Launch, SS Rajamouli Speech Jyo Achyutananda Audioప్రేక్షకుల పల్స్ దర్శకధీరుడు రాజమౌళికి తెలిసినంతగా మరొకరికి తెలియదని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి రాజమౌళి ఒక సినిమా ట్రైలర్ ను చూసి ‘ఇది పక్కా హిట్టు సినిమా’ అని డిక్లేర్ చేసారంటే, ఎంతగా ఇంప్రెస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ట్రైలరే… శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన “జ్యో అచ్యుతానంద.” ఈ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించిన జక్కన్న… తన సోదరుడు, ఈ సినిమాకు సంగీతం వహించిన కళ్యాణ్ రమణపై స్వార్ధం చూపించారు.

ఇది స్వయంగా రాజమౌళినే ‘జ్యో అచ్యుతానంద’ ఆడియో వేడుక నుండి చెప్పారు. ట్రైలర్ చూసాను… చాలా బాగుంది… అనడం కంటే పక్కా హిట్టు సినిమాను దర్శకుడు శ్రీనివాస్ అవసరాల అందించాడని చెప్పవచ్చు… ట్రైలర్లో ఒక సస్పెన్స్ ఉంది… నాగశౌర్య, నారా రోహిత్ లలో ఎవరు హీరోయిన్ ను ప్రేమించారు… హీరోయిన్ రెజీనా ఎవరిని ప్రేమించింది… అన్నది ఆసక్తికరంగా ఉంది… రెజీనా ఎక్స్ ప్రెషన్స్, శౌర్య, రోహిత్ లు బ్రదర్స్ గా బాగా నటించారంటూ కితాబిచ్చిన రాజమౌళి, ఈ ట్రైలర్ ఇంత బాగా రావడానికి కారణం మాత్రం తన సోదరుడేనని చెప్పారు.

మీరేమైనా అనుకోండి… స్వార్ధం అనుకోండి… ఏమనుకోండి… ఈ ట్రైలర్ లో ఎక్కువ మార్కులు సంగీత దర్శకుడు కళ్యాణ్ రమణకు ఇస్తానని, చాలా బ్రహ్మాండంగా సంగీతం అందించాడని, హృదయానికి హత్తుకునేలా ట్రైలర్ ఉంది అంటే… మీరు ఎంత బాగా నటించినా… వాళ్ళు ఎంత బాగా తీసినా… రమణ అందించిన సంగీతమే ఫస్ట్ ప్లేస్ లో ఉంది అనుకుంటున్నాను… రాబోయే రెండు, మూడు నెలల పాటు తన కారులో ఈ సినిమాలోని పాటలే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు… అంటూ నవ్వులతో కూడిన తన స్వార్ధమైన ప్రేమను తన సోదరుడిపై చూపించారు రాజమౌళి.