rajamouli speech at RRR event‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి చేసిన ప్రసంగం సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘వకీల్ సాబ్’ సినిమాతో మొదలైన టికెట్ ధరల విషయమై తనతో సహా ఇండస్ట్రీలోని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సానుకూల వాతావరణం ఏర్పడలేదని అన్నారు. చివరగా చిరంజీవి గారి వలనే ఈ సమస్య పరిష్కారం అయ్యిందని కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే.

అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి ఇంత మంది ప్రయత్నాలు చేసినా ఏపీ ప్రభుత్వం ఎందుకు కనీసం చర్చలకు కూడా పిలవలేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతోంది. అంటే ”రిపబ్లిక్” సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడడానికి మునుపే ఇండస్ట్రీ వర్గాలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లుగా అర్ధమవుతోంది.

కానీ జగన్ సర్కార్ చర్చలకు సుముఖత చూపకపోవడమే సమస్యను మరింతగా జఠిలం చేసిందేమో అన్న టాక్ ప్రస్తుతం ట్రేడ్ వర్గాలలో బలంగా వినపడుతోంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం వలనే సమస్య ఇక్కడిదాకా వచ్చిందన్న భావన ఇప్పటివరకు ఏర్పడగా, రాజమౌళి చేసిన పరోక్ష వ్యాఖ్యలతో ఇందులో వాస్తవం లేదని స్పష్టమవుతోంది.

ఇక చిరంజీవికి ఇండస్ట్రీ పెద్దగా కొనియాడుతూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన రాజమౌళి, మెగాస్టార్ ను చాలామంది చాలా రకాలుగా అన్నారని, మమ్మల్ని నెగ్గించడం కోసం ఆయన తగ్గారని అన్నారు. అయితే మెగాస్టార్ ను అంతలా విమర్శించింది ఎవరు? ఎవరి ముందు ఆయన తగ్గారు? పరోక్షంగా రాజమౌళి ఇచ్చిన హింట్స్ ఏమిటి? అన్నది ప్రస్తుతం అందరికి అర్ధమవుతోంది.