RRR-Started-Leaking,-No-Spoilers-Please!టాలీవుడ్ అగ్రహీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగా నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గత కొంత కాలంగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి బ్రేక్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ గ్యాప్ లోనే రాజమౌళి ఏదో పర్సనల్ పని మీద అమెరికా వెళ్లారట. వచ్చిన వెంటనే షూటింగ్ మొదలు అవుతుందని తెలిపింది చిత్రబృందం. తొందరలోనే ఉత్తర భారతంలో ఒక షెడ్యూల్ ఉంటుందని సమాచారం.

అహ్మదాబాద్, పూణే లలో రామ్ చరణ్, అలియా భట్ ల పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తారట. ఈ షెడ్యూల్ కోసం ఏప్రిల్ లోనే టీం నార్త్ ఇండియా వెళ్ళింది అయితే రామ్ చరణ్ అక్కడ గాయపడటంతో తిరిగి వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్ర కోసం ఇంకా వేట కొనసాగుతుంది.

ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన ఇంటర్వెల్ బ్యాంగ్ టీం చిత్రీకరించింది. జులై 30, 2020 తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. బాహుబలి తరువాత విడుదల అవుతున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.