Rajamouli RRR movie updatesఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ చిత్ర బృందం తమ సినిమా సరికొత్త షెడ్యూల్ కోసం విశాఖపట్నం మన్యం ప్రాంతానికి వెళ్ళింది. పాడేరు మండలంలో మోదాపల్లి, డల్లాపల్లి ప్రాంతాల్లోని కాఫీ తోటల్లో మంగళవారం నుంచి ఆరు రోజుల పాటు సినిమాకు సంబంధించిన క్తైమాక్స్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

ఈ సినిమా ఆంగ్లేయులపై పోరా టం సాధించిన అల్లూరి సీతారామరాజు, కొమరమ్‌ భీమ్‌ల కథ ఆధారంగా చిత్రీకరిస్తుండడంతో, అందుకు సంబంధించిన పలు సన్నివేశాలను మన్యంలో చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ వివరాలు, ఇతర సమాచారాన్ని మీడియాకు తెలిపేందుకు యూనిట్‌ సభ్యులు నిరాకరిస్తున్నారు.

అయితే ఏదో ఒక రోజు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా షూటింగ్ కు వస్తారని వార్తలు రావడంతో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలలో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. గత నెలలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయ్యిందని చిత్రబృందం చెప్పుకొచ్చింది.

అయితే అప్పుడు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఇది వరకు చెప్పిన జులై 30, 2020 రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించకుండా 2020లో ప్రేక్షకుల ముందుకు పది భాషలలో వస్తుందని చెప్పడం గమనార్హం. దీనితో సినిమా వాయిదా పడింది అనే అనుమానాలు బలపడ్డాయి. దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు డీవీవీ దానయ్య. బాహుబలి తరువాత వచ్చే సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.