రాజమౌళి అటు తిప్పినా ఇటు తిప్పినా నష్టమేమీ లేదు

rajamouli RRR Movie#RoarOfRRR – ఎస్ఎస్ రాజమౌళి యొక్క ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోకు అనుకున్నట్టుగానే సంచలనాత్మక స్పందన లభించింది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు రాజమౌళి స్థాయిలో ఉన్నది ఏదైనా బయటకు వచ్చిందంటే అది ఈ వీడియో నే అని చెప్పుకోవచ్చు.

దానితో ఈ వీడియో కారణంగా సినిమా మీద ఉన్న హైప్ అలాగే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. సినిమాలో మరీ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు గ్రాండ్ గా… అలాగే రాజమౌళి స్థాయిలో ఉన్నాయి. మరోవైపు.. అక్టోబర్ 13న విడుదల అవుతుందని చిత్రబృందం మరోసారి కంఫర్మ్ చేసింది.

రెండవ వేవ్ తర్వాత విడుదలైన ప్రతీ ప్రమోషనల్ మెటీరియల్‌ పైనా ఇదే డేట్ ఉంది. దానితో ఆ రోజు విడుదలకు రాజమౌళి సిన్సియర్ గానే ట్రై చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా సినిమా విడుదల అయ్యే అవకాశాలు తక్కువే.

అయితే మొన్నటివరకూ రాజమౌళి ఏదో ఒకటి తెలుస్తే తమ సినిమాల విడుదల తేదీలు తాము ప్రకటించుకుంటాం కదా అని మిగతా స్టార్ సినిమాల నిర్మాతలు వాపోయారు. అయితే ఇప్పుడు రాజమౌళి ఆ డేట్ కి వచ్చినా రాకపోయినా ఎవరికీ నష్టం లేదు. థర్డ్ వేవ్ కారణంగా పెద్ద సినిమాలు తొందరపడటం లేదు.

దసరా బరిలో కేవలం ఆచార్య మాత్రమే ఉంది. ఆ సినిమా కూడా అప్పటికి రెడీగా ఉంటుంది అవకాశం ఉంటే రిలీజ్ చేసుకుంటారు లేకపోతే లేదు. దసరా టైం కి రావాల్సిన పుష్ప, కేజీఎఫ్ 2 సినిమాలు డిసెంబర్ కు గానీ వచ్చే అవకాశం లేదంటున్నారు.

అక్టోబర్ లో వచ్చే మిగతా సినిమాలు కూడా అప్పుడు చూద్దాంలే అన్నట్టు ఉన్నాయి. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ రేట్ల సంగతి కూడా ఇంకా తేల్చలేదు. ఈ తరుణంలో ఎవరు కంగారులో లేరు. ఈ సమస్యలు అన్నీ పరిష్కారం అయ్యేసరికి ఆర్ఆర్ఆర్ మీద ఏదో క్లారిటీ వస్తుందిలే అనుకుంటున్నారు అంతా.

Follow @mirchi9 for more User Comments
Dosti Music RRR - HemaChandra, MM Keeravaani -Jr NTR-Ram Charan-RajamouliDon't MissRRR Song – Thematic Yet Appealing With Goosebumps EndingThe first song, Dosti, of the most awaited movie of the year RRR, is out....Sankranthi 2022 Dates - Here's The Biggest Gainers And LosersDon't MissSankranthi 2022 Dates - Here's The Biggest Gainers And LosersThe Sankranthi 2022 biggies’ dates are out with the announcement of the release date of...Prashant Kishor - YS JaganDon't MissPrashant Kishor Pushes Jagan Into A FixA Newspaper report has carried that Political strategist Prashant Kishor has met YSR Congress MP...Ishq: Not A Love Story Movie ReviewDon't MissIshq: Not A Love Story Review - A Terrible RemakeBOTTOM LINE A Terrible Remake OUR RATING 2/5 CENSOR 'U/A', 1h 55m What Is the...Don't MissThimmarusu Review - Over-Smart, Yet Watchable!BOTTOM LINE Over-Smart, Yet Watchable OUR RATING 2.75/5 CENSOR 'U/A' What Is the Film About?...
Mirchi9