Rajamouli-RRR Movie Shootingఎస్ఎస్ రాజమౌళి గత వారం రోజులుగా తన ఆర్ఆర్ఆర్ కోసం టెస్ట్ షూట్ ప్లాన్ చేస్తున్నారు. కానీ అది వివిధ కారణాల వల్ల వాయిదా పడుతోంది. తాజాగా ఈ టెస్ట్ షూట్ జూన్ 25 నుండి గాండిపేటలో రెండు రోజుల పాటు ప్రారంభమవుతుందని వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని మార్గదర్శకాలకు కట్టుబడి ఈ షూట్ జరుగుతుంది.

రాజమౌళి చిత్రంలోని ప్రధాన నటులకు బదులుగా డ్యూప్‌లను ఉపయోగించనున్నారు. టెస్ట్ షూట్‌తో సంతృప్తి చెందినట్టు అయితే ఈ సెట్‌లో రాజమౌళి ఒక నెల సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి 2021 కోసం విడుదల కావాల్సి ఉంది, కానీ కరోనా వైరస్ పాండమిక్, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఈ చిత్రం జూలై 30 వరకు వాయిదా పడుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా ఆర్ఆర్ఆర్ ఒక కల్పిత కథ. వారి పోరాటాలకు ముందు ఢిల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో ఈ చిత్రం. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ తెలంగాణ వారియర్ పాత్రలో నటించనున్నారు.

ఈ మూవీకి పాన్-ఇండియా విడుదల ఉంటుంది. జులై రిలీజ్ ఒక రకంగా మంచిదే. అప్పటికి ఆర్ధిక మందగమనం ఏమైనా ఉంటే ఆ ఎఫెక్ట్ పోతుంది. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద రష్ తగ్గి అన్ని భాషలలోనూ పోటీ లేకుండా ఒకే సారి విడుదల అయ్యే అవకాశం కలుగుతుంది.