Rajamouli - RRRబాహుబలి సినిమాలో “వీడెక్కడున్న రాజేరా..!” అంటూ ప్రభాస్ ను ఉద్దేశించి నాజర్ చెప్పే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే డైలాగ్ రాజమౌళిని ఉద్దేశించి సోషల్ మీడియాలో అభిమానులు నీరాజనం పలుకుతున్నారు.

ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శక దిగ్గజం రాజమౌళి. ఈ సినిమా చూసాక ఇక అపజయమే ఉండని డైరెక్టర్ కూడా జక్కన్నే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఒక్క అగ్రహీరోతోనే సినిమా తీసి అభిమానుల అంచనాలను అందుకోలేక., కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనుకకు రాక బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడిన ఉదంతాలు కోకొల్లలు.

Also Read – ఏపీలో గేమ్ చేంజర్‌ ఇప్పుడు కౌంటింగే

అలాంటిది ఇద్దరు బడా హీరోలు., అందునా ఇద్దరికీ సపరేట్ ఫ్యాన్ బేస్., ఒక విధంగా చెప్పాలంటే మెగా – నందమూరి అంటే వ్యతిరేక ధృవాలు… ఇన్ని విషయాలను పరిగణలో పెట్టుకొని సినిమా తెరకెక్కించాలంటే ఆ దర్శకుడికి సినిమాను తెరకెక్కించాలంటే ‘కత్తిమీద సాములాంటిదే’ అంటున్నారు ట్రేడ్ వర్గీయులు.

‘ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్… ఒకేసారి వందమందిని పంపించు., లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకో..!’ అంటూ రామ్ చరణ్ ‘మగధీర’లో చెప్పిన డైలాగ్ మాదిరి ఒక్క హీరోను కాదు, ఎంతమంది హీరోలను పెట్టయినా సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టగలను., అభిమానుల అంచనాలను అందుకోగలను, ఆ సత్తా తనకుందని ప్రపంచానికి చాటిచెప్పే విధంగా రాజమౌళి దర్శకత్వ ప్రతిభ గురించి ప్రశంసల జల్లు కురుస్తోంది.

Also Read – ఈ విషయంలో జగన్, కేసీఆర్‌ దొందూ దొందేనా?

మెగా – నందమూరి అభిమానులు., సినిమా చూసిన ప్రేక్షకులు., తమ అంచనాలకు మించి ‘ఆర్ఆర్ఆర్’ ఉందంటూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తున్నారు. ఇక సెలబ్రెటీలు అయితే తమ ట్వీట్లతో అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నారు. రామ్ చరణ్., ఎన్టీఆర్ నటనను ప్రశంసిస్తూ, రాజమౌళి విజనరీ డైరెక్షన్ కు ‘టేకే భౌ’ అంటున్నారు.

ఇలా సినీ ఇండస్ట్రీ నుండే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా “ఆర్ఆర్ఆర్” సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘బాహుబలి’తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసిన ఘనత జక్కన్న, ఈ “ఆర్ఆర్ఆర్”తో మరో మెట్టు పైకి ఎక్కించారు. అందుకే రాజమౌళికి టాలీవుడ్ లో ప్రత్యేక గౌరవం దక్కాల్సిందే అంటున్నారు తెలుగు సినీ ప్రేక్షకులు.

Also Read – జూన్ 4న వైసీపి నేతలు ఎలా ఏర్పాట్లు చేసుకోవాలంటే…

ప్రభుత్వాలు ఇచ్చే గౌరవ మర్యాదలు ఎలా ఉన్నా, ప్రేక్షకుల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్న రాజమౌళిని ఆయన పాటల్లోనే అభిమానులు కీర్తిస్తున్నారు. “దండాలయ్యా.. దండాలయ్యా.. మా రాజై నువ్వు ఉండాలయ్యా.!” అంటూ “వీడేం చేసినా బ్లాక్ బస్టరేనయ్యా..!” అంటూ సినీ పరిభాషలోనే రాజమౌళికి నీరాజనం పలుకుతున్నారు.