Rajamouli - RRRఎస్ఎస్ రాజమౌలి యొక్క ఆర్ఆర్ఆర్ బృందం ఇటీవల తమ చిత్రం నుండి అలియా భట్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. చిత్రంలోని ఆమె లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం యొక్క టాకీ భాగాల షూటింగ్ ను అలియా ఇప్పటికే పూర్తి చేసింది. చరణ్ మరియు అలియా భట్ లపై ఒక పాట మాత్రమే బ్యాలన్స్ ఉంది.

అయితే, ఈ చిత్రంలో రాజమౌళి అలియా పాత్రను విస్తరించాడని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో అలియా కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే మనకున్న సమాచారం ప్రకారం అటువంటిది ఏమీ లేదు. “రాజమౌళి తన సినిమా సెట్స్ మీదకు వెళ్ళేటప్పటికే స్క్రిప్ట్ లాక్ చేస్తారు. తరువాత మార్పులు ఉండవు. అదే ఆయన సక్సెస్ కు సీక్రెట్,” అని ఆర్ఆర్ఆర్ బృందం మనకు తెలిపింది.

అలియా భట్ ఈ సినిమాతో తెలుగు అరంగేట్రం చేస్తోంది. ఈ వారాంతంలో చిత్రీకరించబోయే పాట కోసం నటి హైదరాబాద్ రావాల్సి ఉంది. అయితే, తన గంగూబాయి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో ఆమె ఆమె గృహ నిర్బంధంలో కి వెళ్లడంతో అది వాయిదా పడింది. మరోవైపు ఆచార్య కోసం బ్రేక్ తీసుకున్న రామ్ చరణ్ తిరిగి షూట్ మొదలుపెట్టాడు.

ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోతే సంక్రాంతికి వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా ఆర్ఆర్ఆర్ ఒక కల్పిత కథ. వారి పోరాటాలకు ముందు ఢీల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో అనేది ఈ చిత్రం.