Rajamouli reveals baahubali 2 war sequences‘డౌన్ టు ఎర్త్ పర్సన్’ అని సినీ పరిశ్రమలలో చాలా మంది పేర్లను పేర్కొంటుంటారు. అయితే నిజంగా ఆ పదానికి అర్హుడు ఎవరైనా ఉన్నారు అంటే… ఆ అగ్ర తాంబూలం రాజమౌళికే దక్కుతుంది. వ్యక్తిగతంగా ఎంత అణిగిమణిగి ఉంటారో, సినిమాల పబ్లిసిటీ విషయంలో కూడా అంత జాగ్రత్త వహిస్తారు. తన సినిమాలపై అంచనాలు పెంచే రొటీన్ సినీ జనాల మాటలకు జక్కన్న బహు దూరం. అలాంటి రాజమౌళి ‘బాహుబలి 2’లో యుద్ధ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో… ఆ ఫైటింగ్ సీన్ సినిమాకే హైలైట్ అవుతుందన్న టాక్ అప్పుడే ఊపందుకుంది.

“బాహుబలి 2”లో తాను బాగా కష్టపడి తెరకెక్కించిన సన్నివేశం యుద్ధం ఎపిసోడ్ అని, దాదాపు రెండున్నర్ర నెలల పాటు ఈ పోరాట సన్నివేశాలను చిత్రీకరించామని, ఇందుకు వర్షం కూడా సహకరించిందని తెలిపారు. కేవలం తానూ పడ్డ కష్టాన్ని గురించి మాత్రమే రాజమౌళి ప్రస్తావించారు తప్ప, యుద్ధ సన్నివేశాలు అద్భుతం, అమోఘం అంటూ ఏమీ చెప్పలేదు. ఇదే ఇతర సినీ జనాల నుండి రాజమౌళిని వేరు చేస్తోంది. అయితే రాజమౌళి నుండి ఈ మాత్రం ప్రకటన వచ్చిందంటే… అవి ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.

‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ లో ఫైటింగ్ సన్నివేశాలు అలరించినప్పటికీ, చరిత్రలో నిలిచిపోయే రాజమౌళి మార్క్ ఫైటింగ్ లు మాత్రం కొరవడ్డ మాట వాస్తవమే. దీంతో ‘బాహుబలి 2’లో అయినా జక్కన్న మార్క్ హీరోయిజం సన్నివేశాలు ఉంటాయోమోనని యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా మరో విషయం ఏమిటంటే… ఈ సినిమాలో అనుష్క ప్రధాన హీరోయిన్ అని, తమన్నాతో కనీసం ఓ పాట కూడా ఉండదని స్పష్టత ఇచ్చేసారు జక్కన్న.