Rajamouli RRRఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ రెగ్యులర్ షూటింగ్ 2018 నవంబర్ లో మొదలయ్యింది. ఆ సినిమా ఈ ఏడాది వేసవికి పూర్తయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. సినిమా మొదలుపెట్టడానికి ముందే రాజమౌళి ఈ సినిమా విడుదల అయ్యేవరకు ఇంకో సినిమా ఏదీ చెయ్యకూడదని రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు కండిషన్ పెట్టాడు.

రాజమౌళి సినిమా అంటే ఇక మారు మాట్లాడేది ఏముంది? పైగా బాహుబలి తరువాత చేసే సినిమా ఇది. అయితే కరోనా కారణంగా ఇంకో ఏడాది సినిమా విడుదల ఆగిపోయింది. దీనితో మూడేళ్లకు పైగా హీరోలు ఈ ప్రాజెక్టులో చిక్కుబడిపోయారు. మొదట్లో సినిమా విడుదల అయ్యే వరకు వేరే సినిమా చెయ్యకూడదు అన్న రాజమౌళి ఆ తరువాత షూటింగ్ పూర్తి అయ్యే వరకు అని కండిషన్ సడలించాడు.

ఇప్పుడు ఇంకొంచెం పంతం వీడి షూటింగ్ అవ్వకుండానే రామ్ చరణ్ ని ఆచార్య చెయ్యనిస్తున్నాడట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనకు అందుబాటులో ఉండేలా పర్మిషన్ ఇచ్చాడు. దాని ప్రకారం ఈ నెల మూడో వారం లో మూడు రోజుల పాటు ఆచార్య షూటింగ్ కు చరణ్ డేట్ లు కేటాయించాడు. ఈ షూట్ లో చరణ్ మీద వున్న సొలో సీన్లు చిత్రీకరిస్తారు.

ఫిబ్రవరిలో కొన్ని రోజు చిరంజీవి తో కాంబినేషన్ సీన్లు తీస్తారు. మార్చిలో మరికొన్ని సోలో సీన్లు తీస్తారు. ఈ మధ్యలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా చేస్తాడు. అయితే డేట్స్ విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం రాజమౌళికే. ఏది ఏమైనా ఇప్పుడు ఆచార్య టీమ్ ఊపిరి పీల్చుకుంది. త్వరగా షూట్ పూర్తి చేసి మే నెలలో విడుదలకు సిద్ధం అవుతుంది.