rrr Rajamouli Jr NTR Ram Charanఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ బృందం వారి చిత్రం యొక్క కొత్త పోస్టర్ను ఈరోజు ఉదయం విడుదల చేసింది. పోస్టర్లో ఎన్టీఆర్ బైక్ నడుపుతుండగా రామ్ చరణ్ వెనకాల కూర్చున్నాడు. ఇద్దరు నవ్వుతూ నిజంగా అన్నదమ్ములా అన్నట్టుగా పోస్టర్ లో అన్యోన్యంగా ఉన్నారు.

పోస్టర్‌కు సోషల్ మీడియాలో సంచలనాత్మక స్పందన వచ్చింది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. అలాగే ఇద్దరు నటులు రెండు భాషల్లో తమ డబ్బింగ్‌ను పూర్తి చేశారని కూడా వారు వెల్లడించారు. అంతవరకూ బానే ఉంది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… పోస్టర్ మీద విడుదల తేదీని ప్రస్తావించడం. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా సినిమా వాయిదా పడటం ఖాయమని అంతా అనుకుంటున్నారు… ఈ తరుణంలో ఇంతకుముందు ప్రకటించినట్లుగా ఈ చిత్రం అక్టోబర్ 13 న విడుదల కానుందని పోస్టర్‌లో పేర్కొన్నారు.

అక్టోబర్ 13 న విడుదలయ్యే సమయానికి ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసినా, పాన్-ఇండియా విడుదలకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఆయన ఆ కొత్త డేట్ ఏదో చెప్పేస్తే మిగతా నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకుంటారు కదా? ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్లకు కూడా రిలీజ్ డేట్ ని బట్టి చేసుకోవాల్సిన ఏర్పాట్లు చాలానే ఉంటాయి.

దసరా సీజన్ ని ఆర్ఆర్ఆర్ వదిలేస్తే ఆ డేట్ మీద కర్చీఫ్ వేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇవేమీ జరగకుండా రాజమౌళి అదే పాత పాట పాడుతున్నారు. అయితే కనీసం అభిమానులకు కూడా దసరాకు సినిమా విడుదల అవుతుంది అనే నమ్మకం లేదు.