Rajamouli on Baahubali Copy Vs Lion Kingరాజమౌళి సినిమాలలో కాపీ సన్నివేశాల గురించి గతంలో చాలా సన్నివేశాలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘విక్రమార్కుడు’ సినిమాలో పోలీస్ బెల్ట్ కూడా డ్యూటీ చేస్తుందనే సన్నివేశం మక్కికి మక్కి విజయశాంతి సినిమాలో నుండి కాపీ కొట్టినట్లుగా ఉండడంతో, ఆ తర్వాత వీటి పైన కూడా వివరణ ఇచ్చిన సందర్భాలున్నాయి. అలాగే ‘బాహుబలి’ ఫస్ట్ పోస్టర్ నుండి ‘బాహుబలి 2’ ఫస్ట్ లుక్ వరకు అనేక సందర్భాలలో జక్కన్నపై కాపీ అభియోగాలు వచ్చాయి.

అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ సరికొత్త ప్రభంజనం సృష్టించడంతో అవన్నీ కనుమరుగయ్యాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ కాపీ ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘బాహుబలి’ చిత్ర కధ “లయన్ కింగ్” సినిమా నుండి తీసుకున్నారని, ఈ రెండు సినిమాల థీమ్స్ ఒకే విధంగా ఉన్నాయన్న టాక్, ఏకంగా రాజమౌళి వరకు వెళ్ళింది. ఇదే ప్రశ్న జక్కన్నను పలకరించినపుడు… ఇది తాను కూడా విన్నానని చెప్పి, అలా కాసేపాగి ఆచితూచి స్పందించారు.

నిజానికి ‘బాహుబలి’ అనేది సరికొత్త కధ ఏమీ కాదని, ఇలాంటివి ప్రపంచంలో చాలా కధలు ఉన్నాయని, ఇలా కధకు కధకు పోలికలు ఉండడం సహజమేనని, అయితే ‘బాహుబలి’ కధ అలాంటిదే అయినా కాన్సెప్ట్ వేరని, ఇక్కడ రాజ్య సింహాసనం కొరకు జరిగే యుద్ధం ఎక్కడా లేదు, అలాగే సింహాసనం దక్కిందని జరిగే హింసా లేదని జక్కన్న తనదైన శైలిలో వివరించారు. ఇక మొదటి భాగంలో తలెత్తిన కాలకేయుడిని నల్లజాతి రాజు విషయంలో చెలరేగిన కుల ప్రస్తావన అనవసరమని, ఇలాంటివి బోలెడు వస్తుంటాయని కొట్టిపారేసారు.