‘ఆర్.ఆర్.ఆర్’ కి సంబంధించి ప్రమోషన్ మొదలెట్టేశాడు రాజమౌళి. రెండు నెలల నుండే తన సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా క్యూరియసిటీ నెలకొనాలని ఫిక్స్ అయిన జక్కన్న ఓ ప్లాన్ ప్రకారం ప్రమోషన్ చేస్తూ వెళ్తున్నాడు.

ఇందులో భాగంగా సినిమాలో ఉన్న సుపర్బ్ షాట్స్ తో ఓ గ్లిమ్స్ వదిలి విజువల్స్ తో ట్రీట్ ఇచ్చాడు. అయితే ఈ గ్లిమ్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ తెలిపోయారు. అవును ఇది ముమ్మాటికీ నిజం. గ్లిమ్స్ చూస్తున్నంత సేపు అబ్బా రాజమౌళి ఇరగదీసాడు అనే మాటలే మైండ్ లో మెదిలాయి తప్ప తారక్, చరణ్ లపై ఫోకస్ వెళ్ళలేదు.

నిజానికి గ్లిమ్స్ అంటే అందులో హీరో , హీరోయిన్స్ , మిగతా షాట్స్ హైలైట్ అవ్వాలి. కానీ RRR గ్లిమ్స్ కి మాత్రం పూర్తి క్రెడిట్ రాజమౌళి కే వెళ్ళింది. సోషల్ మీడియాలో కూడా రాజమౌళి నా మజాకా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి .హీరోల అభిమానులు మాత్రమే గ్లిమ్స్ లో వారి షాట్స్ తో ఫొటోస్ పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కానీ మూవీ లవర్స్ అందరూ మాత్రమే రాజమౌళి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.

నిజానికి రాజమౌళి తో సినిమా అంటే ఇలాగే ఉంటుంది మరి. అది టీజర్ అయినా సినిమా అయినా చూశాక ముందుగా ఆయన గురించే చెప్పుకుంటారు మాట్లాడుకుంటారు. ఆ తర్వాతే ఎవరైనా.. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఈసారి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా కావడంతో వారి ఫ్యాన్స్ రాజమౌళి మీద కాస్త కోపంగా ఉన్నారు. హీరోలను రిలీజ్ కి ముందు భీభత్సంగా ఎలివేట్ చేయాలని వారి కోరిక. అది మాత్రం జరగదు అనేలా రాజమౌళి మేకింగ్ డామినేట్ చేస్తుంది మరి.

ఇక సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిట్టయితే కచ్చితంగా హీరోలకి పేరొస్తుంది. ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కి కూడా అదే జరిగిందిగా. కావున RRR రిలీజ్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు కూడా ఆ క్రేజ్ రావడం ఖాయం.