Baahubali Conclusion, Baahubali Conclusion Climax, Baahubali Conclusion Climax Shooting, Baahubali Conclusion Movie Climax 2015లో విడుదలకపోయి తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన చిత్రం ‘బాహుబలి – ది బిగినింగ్’. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రం క్లైమాక్స్ కు ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ వేసి జనాల పైకి వదిలాడు. అదే అసలు కట్టప్ప తన రాజైన బాహుబలిని ఎందుకు చంపాడు ? ఈ ప్రశ్న తొలవని తెలుగు ప్రేక్షకుడి మెదడు ఉండదంటే అతిశయోక్తి కాదు. కరెక్టుగా ఈ ప్రశ్ననే బాహుబలి రెండవ పార్ట్ పై భారీ క్రేజ్ ఏర్పడేలా వాడుకున్నాడు రాజమౌళి.

అలాగే ఈ ప్రశ్నకు అద్భుతమైన, ప్రేక్షకుడు ఆశ్చర్యపోయే విధంగా జవాబు ఇవ్వడానికి రాజమౌళి అహర్నిశలూ కష్టపడుతున్నాడు. అందుకే కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు విజువల్ ఆన్సర్ ఇచ్చేందుకు జక్కన్న బాహుబలిని నాలుగు సార్లు చంపాడట.

అంటే కథలో కట్టప్ప, బాహుబలిని చంపే సన్నివేశాన్ని నాలుగు విధాలుగా చిత్రీకరించాడట. ఈ నాలుగింటినీ తన సన్నిహితులైన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు, బాలీవడు నిర్మాత కరణ్ జోహార్ కు, మరోక ముఖ్య వ్యక్తికీ చూపి వాటిలో ఏదైతే ప్రేక్షకుడికి బాగా కనెక్టవుతుందో సజెషన్ ఇవ్వమన్నాడట. అంటే మొత్తానికి రాజమౌళి కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ధర్మ సందేహానికి సరైన జవాబే ఇవ్వనున్నాడన్నమాట.