Jyo Achyutananda, Rajamouli Jyo Achyutananda Review, SS Rajamouli Jyo Achyutananda Review, Director Rajamouli Jyo Achyutananda Reviewప్రేక్షకుల కోణంలో నుండి రాజమౌళి ఆలోచిస్తారు కాబట్టే, ఆయన ప్రతి సినిమా సక్సెస్ అవుతుంది అన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. రాజమౌళి దర్శకత్వం వహించిందే కాదు, ఇతర చిత్రాలను కూడా సామాన్యుల మాదిరి చూస్తారు కాబట్టే… రాజమౌళి రివ్యూ ఇచ్చారంటే అది సినిమాకు ప్లస్ పాయింట్ గా మారుతోంది. అలాంటి రాజమౌళి తాజాగా “జ్యో అచ్యుతానంద” సినిమాను చూసి సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.

వారాహి + శ్రీనివాస్ అవసరాల + కళ్యాణ్ రమణ కాంభినేషన్ మరోసారి ప్రేక్షకులకు ఫ్యామిలీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను అందించారని, ఎక్కడ ఓవర్ లేకుండా సినిమా అంతా ఫన్ ఉండేలా, చివరి పది నిముషాలు హృదయానికి హత్తుకునేలా ఉందని అన్న రాజమౌళి, నారా రోహిత్, నాగశౌర్యలు అన్నదమ్ములుగా బాగా నటించారని, మొదటి సారి చూస్తున్న రెజినా ఆకట్టుకునే విధంగా చేసిందని తన అనుభూతులను పంచుకున్నారు.

రాజమౌళి పాజిటివ్ గా రివ్యూ ఇచ్చారంటే అది ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే విధంగానే ఉంటుందన్న బ్రాండ్ పడిపోయింది. దీంతో సినీ ఇండస్ట్రీలో సాధారణంగా వినిపించే దర్శకుని ‘ద్వితీయ విఘ్నాన్ని’ అవసరాల విజయవంతంగా దాటేసినట్లే చెప్పవచ్చు. అలాగే వారాహి ఎకౌంటులో “ఊహలు గుసగుసలాడే” సినిమా వంటి మరో హిట్టు పడినట్లే..!