Raja the Great Title song sung by ravi tejaర‌వితేజ అంధుడిగా న‌టిస్తున్న `రాజా ది గ్రేట్‌` టైటిల్ సాంగ్ లిరిక‌ల్ వీడియో విడుద‌లైంది. సాయి కార్తీక్ స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ పాట‌ను రేవంత్‌, సాకేత్‌ ల‌తో క‌లిసి ర‌వితేజ కూడా పాడారు. ఈ పాట‌ను శ్యామ్ కాస‌ర్ల ర‌చించగా, `రాజా… రాజా..రాజా` అంటూ ప్రారంభ‌మైన ఈ పాట‌లో హాస్య‌న‌టుడు శ్రీనివాస్ రెడ్డి కూడా కోర‌స్ పాడుతుండ‌టం విశేషం. సినిమా నిర్మాణ దృశాల్లో ర‌వితేజ కుమారుణ్ని కూడా ఈ వీడియోలో చూపించారు. పాట రికార్డింగ్‌ కి సంబంధించిన దృశ్యాల‌తో కూడిన ఈ వీడియోలో అభిమానులను విశేషంగా అలరిస్తోంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న మెహ్రీన్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.