ys vivekananda reddy murder caseవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి పులివెందుల కోర్టులో 4 గంటల పాటు ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారుతోంది. అంతకుముందు ఇచ్చిన వాంగ్మూలంతోనే ఇప్పటివరకు అయిదుగురి నిందితులను అదుపులోకి తీసుకున్న సీబీఐ, తాజా వాంగ్మూలంతో మరికొన్ని కీలక అరెస్ట్ లు జరిగే అవకాశం ఉందంటూ పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఓ విధంగా ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారే విధంగా ఈ అరెస్ట్ లు ఉండబోతున్నాయని ప్రముఖ మీడియాలు కూడా ప్రచారం చేస్తున్నాయి. ప్రముఖులను అదుపులోకి తీసుకోవాలంటే ఎస్పీ స్థాయి అధికారి సరిపోరు గనుక, డీఐజీ స్థాయి అధికారి చౌరాసియా రావడం దీనికి సంకేతమని అంటున్నారు. రాబోయే వారం, పది రోజుల్లో ఈ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనేది మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

రాష్ట్రంలో అత్యంత భద్రత కలిగించాల్సిన వ్యక్తుల జాబితాలో దస్తగిరి మొదటి స్థానంలో, వివేకా తనయురాలు సునీత రెండో స్థానంలో ఉన్నారని ఇటీవల రఘురామకృష్ణంరాజు కూడా తెలిపారు. అయితే ఈ సెక్యూరిటీ రాష్ట్ర పోలీస్ లు మాత్రం కాదని, కేంద్ర బలగాలతోనే వీరికి సెక్యూరిటీ ఇవ్వాలని సూచనలు చేసారు. ఈ సందర్భంగా పరిటాల రవి కేసు ఫ్లాష్ బ్యాక్ ను ఉదహరించారు.

పరిటాల రవి హత్య కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులందరూ కాలక్రమేణా ఒక్కొక్కరుగా చనిపోయిన వైనం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, హోటల్స్ మొదలుకుని జైలులో కూడా చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. ప్రస్తుతం వివేకా హత్య కేసులో కూడా ఇది పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఆర్ఆర్ఆర్ ఆవేదన.