rahul ravindran wins best screen wrter natinal award ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ అవార్డులలో తెలుగు సినిమాల పంట పండింది. మహానటి, రంగస్థలం, ఆ!, చిలసౌ సినిమాలు అవార్డు పొందాయి. మహానటికి మూడు, అ! కి రెండు, రంగస్థలానికి, చిలసౌ సినిమాలకు ఒక్కొక్కటి వచ్చాయి. అయితే చిలసౌ సినిమా కథ కొంచెం ఆసక్తికరమైనది. నటుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా మారిన మొదటి సినిమా. దానికి అప్పట్లో డీసెంట్ రిజల్ట్ వచ్చింది.

ఆ సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వరించింది. రాహుల్ రవీంద్రన్ ఆ సినిమాకు స్క్రీన్ ప్లే ఇచ్చారు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే రాహుల్ రెండో చిత్రం, మన్మథుడు 2 ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఇప్పటికే డిజాస్టర్ టాక్ రాబట్టింది. రివ్యూలు కూడా ఘోరంగా వస్తున్నాయి. చిలసౌకు బెస్ట్ స్క్రీన్ ప్లే అని జాతీయ అవార్డు వస్తే, మన్మథుడు 2కు అది మైనస్ అని రివ్యూలలో చెబుతున్నారు. ఈ రెండు ఒకే రోజు జరగడం రాహుల్ రవీంద్రన్ కు విషాదం అని చెప్పుకోవాలి.

ఇది ఇలా ఉండగా అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాకు ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికయ్యింది. ఆ సినిమాలో అపురూపమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఉత్తమ నటుడిగా రంగస్థలంలో రామ్ చరణ్ ఎంపిక అవుతారని మెగా అభిమానులు ఆశించారు అయితే ఆయనకు అవార్డు రాకపోవడం వారిని నిరాశపరచింది. ఊరి సినిమాలో నటించిన విక్కీ కౌశల్, అంధాదున్ లో నటించిన ఆయుష్మాన్ ఖురానా ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు.