ఈ రోజు ఉదయం అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుదలైన “చి|| ల|| సౌ||” ధియేటిరికల్ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. సినీ విమర్శకులతో పాటు అనేక మంది సెలబ్రిటీల మదిని కూడా దోచుకున్న ఈ ట్రైలర్ స్పందన పట్ల దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.
‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయమైన రాహుల్, ఆ తర్వాత కొద్ది సినిమాలలో హీరోగా నటించారు గానీ, “అలా ఎలా” తప్ప మిగతావి సక్సెస్ కాకపోవడంతో పెద్దగా గుర్తింపు లభించలేదు. ఈ తరుణంలో మెగా ఫోన్ పట్టుకుని ఫ్లాప్ హీరోగా ముద్రపడిన సుశాంత్ ను హీరోగా పెట్టుకుని “చి||ల||సౌ||” తెరకెక్కించాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున నిర్మించిన ఈ సినిమాను ఆగష్టు 3వ తేదీన విడుదల చేస్తుండగా, ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్ ను విడుదల చేసారు. లవ్ కంటెంట్ నేపధ్యంలో ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ ట్రైలర్ ను చూసిన వీక్షకులు ప్రశంసలతో ముంచెత్తారు.
ఒక కొత్త దర్శకుడికి ఇంతకంటే మంచి స్పందన ఎక్కడ లభిస్తుంది? అంటూ ఆనందంతో ఊబ్బితబ్బిబ్బైపోతున్నాడు రాహుల్. అందుకే ప్రేక్షకులకు, మీడియా వారికి, ఇండస్ట్రీ జనులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్ చేసాడు. ట్రైలర్ మాదిరిగానే సినిమాకు కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నాడు రాహుల్.
So much of affection for our trailer.. thank you people 🙏🏽 Don’t even know how to say thank you adequately. A debut filmmaker can’t ask for more than this support from audiences, the media and the industry. Really hope you’ll all like the film too. 🙏🏽🙏🏽🙏🏽❤️❤️❤️
— Rahul Ravindran (@23_rahulr) July 28, 2018