rahul-gandhi-smiling-at-jayalalithaa-homageవందల ఏళ్ళు చరిత్ర కలిగిన కాంగ్రెస్ తరపున 2019 ఎన్నికలలో ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీ బరిలోకి దిగనున్న విషయం జగమెరిగిన సత్యమే. మరి ప్రధాని అభ్యర్ధి ఎలా ఉండాలి? చిటికేస్తే… దేశ అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయంపై అనర్గళంగా మాట్లాడగలగాలి. లేదంటే కనీసం తెలుసుకునైనా ప్రవర్తించాలి. ముఖ్యంగా సమయస్పూర్తి చాలా ముఖ్యం. కానీ, రాహుల్ గాంధీలో ఇవేమీ లేవన్న విషయాలను రాజకీయ విజ్ఞులు పలు సందర్భాలలో నిరూపించారు.

తాజాగా జయలలిత మరణం కూడా రాహుల్ గాంధీ సమయస్పూర్తిని మరోసారి నిరూపించిందని సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పార్తీవదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించడానికి విచ్చేసిన రాహుల్ గాంధీ, అమ్మ మృతదేహం వద్దకు వచ్చేసరికి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడం కెమెరా కళ్ళకు చిక్కింది. దీంతో మరోసారి రాహుల్ గాంధీ “ప్రతిభ” అందరికీ తెలిసి వచ్చినట్లయ్యింది.

పెళ్లి దగ్గర నవ్వడం, శవం దగ్గర ఏడవడం… ఒక్క భారతీయ సంస్కృతిలోనే కాదు… ప్రపంచంలో ఏ మూలాన కూడా శవం దగ్గర నవ్వుతూ కనపడరు. అలా చేసే వారిని ఎలా పిలుస్తారో కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి అలా నవ్వుతున్న ‘రాహుల్ గాంధీ అండ్ కో’ మానసిక పరిస్థితి ఏమిటి? జయలలిత వంటి ఒక మహత్తరమైన వ్యక్తి చనిపోయారన్న వార్త రాహుల్ గాంధీకి ఎలా నవ్వు తెప్పించింది? అన్న ప్రశ్నలతో ఈ ‘వారసుడు’ని ఏకిపారేస్తున్నారు.