Rahul-gandhi-Tirumala--Padayatraతిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు అయ్యారు. అంతకు ముందు ఆయన తిరుమలకు అలిపిరి నుండి కాలి నడకన వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. కేవలం గంటా 50 నిమిషాల వ్యవధిలోనే తిరుమలకు చేరుకున్నారు. మేనల్లుడు రేహాన్‌ వాద్రాతో కలసి పోటీపడుతూ నడిచారు. నడక మార్గంలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా సుమారు 3500లకు పైగా మెట్లు ఎక్కారు. రాజకీయ నాయకులలో రాహుల్ దే రికార్డు అని చెప్పొచ్చు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో నడక మార్గం ద్వారా తిరుమల కొండపైకి ఎక్కారు. కాలి నడకన కొండపైకి చేరుకునేందుకు ఆయనకు రెండు గంటల సమయం పట్టింది. పాదయాత్ర ముగిసిన తర్వాత ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి కూడా నడకన తిరుమలకు వెళ్లారు. ఆయన మూడున్నర గంటల్లో తిరుమలకు చేరుకున్నారు. మొన్నా మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య నడకమార్గంలో తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శించుకున్నారు.

ఆయన దాదాపు మూడున్నర గంటల్లో ఆయన కొండపైకి చేరుకున్నారు. మార్గమధ్యలో ఎన్నో బ్రేకులు తీసుకున్నారు. దారి పొడవునా చెమటతో తడిసి మొద్దయిపోయారు. 2009 లో కాంగ్రెస్ నేత, నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన కొత్తలో నడకమార్గంలో తిరుమలకు వెళ్లారు. కొండ ఎక్కే సమయంలో ఆయన చాలా చోట్ల విశ్రాంతి తీసుకున్నారు. దీంతో ఆయనకు ఏడున్నర గంటల సమయం పట్టింది. రాజకీయ నాయకులలో ఒక రకంగా చిరంజీవి బాగా ఎక్కువ సమయం తీసుకున్నట్టు… రాహుల్ తక్కువ తీసుకున్నారు. 70 ఏళ్ళ వయసులో చంద్రబాబు రాహుల్ తో సమానంగా నడవడం విశేషం.