rahul gandhi No reponse on jammu kashmir article 370జమ్మూకాశ్మీర్ సమస్య పరిష్కారానికి తొలి అడుగు అని చెబుతూ ఆర్టికల్ 370ని సాగనంపింది బీజేపీ ప్రభుత్వం. జమ్ము, కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలను విడదీశారు. వీటిల్లో జమ్ము, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుకాగా.. లద్దాక్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. కాంగ్రెస్ మరికొన్ని పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు ఈ బిల్లును సమర్ధించాయి. ఎన్డీయే లో లేని పార్టీలు, మోడీ తో శత్రుత్వం నడిపిన చంద్రబాబు నాయుడు వంటి వారు కూడా బిల్లుని సమర్ధించారు.

కాంగ్రెస్ ఈ బిల్లును వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రజల ఆకాంక్షలకు ఎంత దూరంగా ఉన్నది తెలియజేస్తుంది. ప్రభుత్వనికి పేరు వచ్చే ఏ బిల్లుని అయినా వ్యతిరేకించాలని గట్టిగా నిర్ణయించుకోవడం అనే ఒకేఒక్క ప్రాతిపదిక మీద ఈ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలను పూర్తిగా విస్మరించింది. తనని తాను దేశప్రయోజనాలకు వ్యతిరేకంగా చూపించుకుని బీజేపీ పని మరింత సులువు చేసింది. కాంగ్రెస్ తాజా మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటివరకూ దీని మీద స్పందించకపోవడం గమనార్హం.

ప్రభుత్వం వేస్తున్న ప్రతీ ఎత్తుకు కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకోవడం గమనార్హం. ఇది ఇలా ఉండగా కాశ్మీర్ కు మోడీ – అమిత్ షా చూపిన పరిష్కారం వాళ్ళ వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఇది ఏ రకమైన పరిస్థితులకు దారి తీసినా కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఎవరు చెయ్యని సాహసానికి మోడీ – అమిత్ షా పూనుకున్నారని చరిత్రలో లిఖితం అవుతుంది. 70 ఏళ్ళ పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఏమీ చెయ్యలేకపోయింది ఈ విషయంలో అనే అపవాదు కూడా మొయ్యాలి.