Raghuveera-Reddyకుమారస్వామి ప్రమాణస్వీకారం సమయంలో రాహుల్ గాంధీ చంద్రబాబుకి షేక్ హ్యాండ్ ఇవ్వడం తరువాత బాబు రాహుల్ భుజం తట్టడం జరిగాక టీడీపీ కాంగ్రెస్ పొత్తు వుండబోతుందనే వదంతులు వేగంగా వ్యాపించాయి. వీటి మీద కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుది వన్ సైడ్ లవ్ అన్నారు.

టీడీపీతో పొత్తు ఉండే సమస్యే లేదన్నారు. నిజానికి ఇవాళ్టి రోజున ఎవరన్నా పొత్తు పెట్టుకుంటాం అంటే రఘువీరా పూర్ణకుంభంతో ఎదురు వెళ్ళాలి. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అటువంటిది. కాంగ్రెస్ రాష్ట్రంలో చేస్తున్న పోరాటం కనీసం అన్ని సీట్ల లోనూ డిపాసిట్లు తెచ్చుకోవడానికే. రఘువీరా కూడా గెలిచే పరిస్థితి లేదు.

కాంగ్రెస్ తో ఏ పార్టీ అయినా కలిసితే వారు కూడా మునిగే పరిస్థితి ఇప్పుడు. ఇలాంటి సమయంలో ఇలాంటి డైలాగులు ఏంటో మరి? ఎలాగో చంద్రబాబు పొత్తు పెట్టుకోడని ఇలా అంటున్నారా? అసలు రఘువీరాగారూ మీరున్న పరిస్థితికి మీ డైలాగులకు సంబంధం ఉందా?