Raghurama Krishnaraja sent legal notice to sakshi tvతన అరెస్టు సందర్భంగా తన మీద ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కథనాలు ప్రసారం చేశారంటూ నిన్న టీవీ9కు లీగల్ నోటీసు పంపారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఈరోజు ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి చెందిన సాక్షి మీడియాకు కూడా అవే రకమైన నోటీసులు పంపడం గమనార్హం.

ఈ నోటీసులో మొట్టమొదటి పేరు… సాక్షి చైర్మన్ గా ఉన్న ముఖ్యమంత్రి సతీమణి… భారతి రెడ్డి ఉండటం గమనార్హం. సాక్షి బోర్డు అఫ్ డైరెక్టర్లు, చీఫ్ ఎడిటర్ కు, అలాగే కన్సల్టెంట్ ఎడిటర్ గా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావుకు నోటీసులు పంపారు. తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేసినందుకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆ మీడియా కథనాలతో తన ప్రతిష్టకు భంగం కలిగిందని నోటీసులో వెల్లడించారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వని పక్షంలో చట్టపరంగా ముందుకు వెళతానని ఆయన స్పష్టం చేశారు. సహజంగా ఇటువంటి కేసులలో మీడియా సంస్థలు వెనక్కు తగ్గవు. పైగా సాక్షి ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ అండదండలు ఉన్న మీడియా సంస్థ.

అటువంటిది ఆ మీడియా సంస్థ దిగి వచ్చి క్షమాపణ కోరే అవకాశం ఏముంటుంది? దీనితో సాక్షి మరింతగా రెచ్చిపోయి రఘురామ కృష్ణంరాజుని టార్గెట్ చేసినా టార్గెట్ చేస్తుందని సోషల్ మీడియాలో అంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చెప్పే వారం రోజుల తరువాత మొదలయ్యే లీగల్ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూడాలి.