raghurama krishnamraju comments on ycp governmentఇసుకలో కొన్ని వేల కోట్లు తినేస్తున్నారు. ‘అమ్మ ఒడి’ ఆ ఒడి ఈ ఒడి అని చెప్పేసి ఏడు లక్షల కోట్లు అప్పు టచ్ చేసారంటే, అందులో కనీసం లక్ష కోట్లు మా ప్రభుత్వ పెద్దలు తినేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 80 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాలి, అవి అలాగే పెండింగ్ లో ఉన్నాయి. ఇది ప్రశ్నిస్తే రాజద్రోహమా? అంటూ వైసీపీ ఎంపీ ఆర్ఆర్ఆర్ తన ఆవేదన వ్యక్తం చేసారు.

రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహమా? రాచరికంలో కూడా ఇంత దారుణంగా పరిపాలించిన రాజు ఎవడూ లేడు. ఇది రాచరికాన్ని మించి ఆటవిక పాలనను తలపించే విధంగా ఉంది. మా ముఖ్యమంత్రి విచారణకు కోర్టుకు హాజరు కాడు. రెండేళ్లలో వచ్చాడా? ఆ జడ్జ్ తీర్పు ఇవ్వరు. నేను ముఖ్యమంత్రిని కాబట్టి వెళ్తే 60 లక్షలు ఖర్చు అయిపోతుందని వెళ్లనంటే ఎట్లా? అడిగినోడికి సిగ్గు ఉండక్కర్లేదా?

40 రోజుల నుండి తీర్పు పెండింగ్ లో ఉంది. ఎవరిదీ లోపం? ముఖ్యమంత్రిదా? న్యాయస్థానందా? ముఖ్యమంత్రి కాబట్టి దోషుకున్నా పర్లేదు, దాషుకున్నా పర్లేదు అని న్యాయస్థానాన్ని చెప్పమనండి. సీఎం కోర్టుకు హాజరు కారా? నేనేమో పిలిచినప్పుడు పండగ రోజుల్లో రావాలా? అతను ముఖ్యమంత్రి అయితే తాను ఎంపీ కదా? ప్రశ్నిస్తే రాజద్రోహం అంటారా?

ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే పిరికోడు అనడానికి నోరు ఎలా వచ్చింది మీకు? కొన్ని మీడియా ఛానెల్స్ వాళ్ళు చెప్పిందే రాస్తారు. భయపడితే మీ మీదే పోటీ చేసి నెగ్గుతానని చెప్తాడా? సిగ్గుండాలి మాట్లాడేవాడికి. నేను రెడీ… ఫైట్ కి..! హైకోర్టు ఏమో అక్కడుంటుందా? సెక్రటేరియట్ ఏమో ఇంకో వైపు ఉంటుందా? అసెంబ్లీ ఏమో ఇక్కడుంటుందా? ఈ దారి ఖర్చులకు అయిపోతారు.

పోనీయ్ తిరగాలంటే రోడ్లు లేవు, రోడ్లు వేయరా బాబు అంటే లే అవుట్లు వేస్తాడంట! చేపలు, రొయ్యలు అమ్ముడతాడంట! కడుపు మండిన ప్రజల ప్రతినిధిగా మాట్లాడుతున్నా, మాట్లాడడానికి నోరు రావట్లేదు ఇవాళ. ప్రశ్నిస్తే… రాజద్రోహమా? ఈ నెల 13,14,16,17 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆర్ఆర్ఆర్ స్పందించిన విధానం.