రాజు గారికి మరీ ఎటకారం ఎక్కువండి!ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్’ 5%పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం వర్గీయులు ‘సింగం’ సినిమాలోని ఓ సీన్ ను ఈ నిర్ణయంతో పోలుస్తూ ట్రోల్ చేస్తుండగా, జనసైనికులు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ‘జగన్ రెడ్డి రాజ్యాంగం’ అంటూ చేసిన వ్యాఖ్యలను జోడించి హంగామా చేస్తున్నారు.

ఇలా ఎవరికి వారు వారికి తోచిన రీతిలో సందడి చేస్తుంటే, ఓ మీడియా ఛానల్ నిర్వహించిన డిబేట్ లో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో ఎటకారపు వ్యాఖ్యల చాతుర్యాన్ని ప్రదర్శించారు. ‘రేపొద్దున శోభనం టాక్స్ అని పెట్టారనుకోండి, వాళ్ళ వాలెంటైర్లు కిటికీల దగ్గర కూర్చుంటారు, నిజం సార్… పార్లమెంట్ లో ‘ల….’ అని తిట్టిన సంస్కారవంతమైన ఈ పార్టీ, శోభనం టాక్స్ వేయలేరండి… వాలెంటైర్ చూడడా కిటికీలో నుండి… చూస్తాడు’ అన్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Also Read – అమరావతి అనే నేను…

ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలతో సదరు డిబేట్ ను నిర్వహిస్తున్న వెంకట కృష్ణనే ‘ఊరుకోండి మీరు మరీనూ’ అంటూ నవ్వేసారంటే, రాజు గారి వ్యాఖ్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఈ వీడియోను తెలుగు తమ్ముళ్ళతో పాటు నెటిజన్లు కూడా ఏ స్థాయిలో షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.

ఏదైనా ఈ గోదావరి జిల్లా వాళ్ళ ఎటకారం ఉంది చూసేరు… అందుకే కదా సినిమాలలో కూడా ఈ ఎటకారాన్ని హైలైట్ చేస్తూ హాస్యాన్ని పండిస్తారు. ఒక ‘బెండ్ అప్పారావు ఆర్ఎంపీ’ ఒక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఇలా చెప్పుకుంటూ పోతే… సిల్వర్ స్క్రీన్ కంటే ఎక్కువ ఎటకారాన్ని రియల్ లైఫ్ లో రాజు గారు పండించేస్తున్నారు మరి!

Also Read – ఓడించిన వ్యక్తిని అభినందించడం… సంస్కారం అంటే ఇది కదా?