Raghunandana-rao-wons--dubbaka-by-electionsదుబ్బాకలో జరిగిన ఉపఎన్నిక ఐపీఎల్ పోరుని తలపించింది. ఈ స్టోరీ ప్రచురించే నాటికీ… నాలుగు ఈవీఎంలు మొరాయించగా మొత్తం కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ అభ్యర్థి 1470 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే స్వల్పతేడాతో ఓడిపోయినా ఈ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఇప్పటికే మార్చేసింది.

ఇప్పటివరకూ ఎటువంటి ప్రతిపక్షం లేకుండా అప్రతిహతంగా సాగిపోతున్న తెరాస జైత్ర యాత్రకు బీజేపీ షాక్ ఇచ్చింది అనడంలో ఎటువంటి అనుమానం. ఇప్పటివరకు దక్షిణాదిన కర్ణాటక తప్పితే ఏ రాష్ట్రంలోనూ ఆశలు లేని బీజేపీకి మొదటిసారిగా ఆశ కలిపిస్తుంది. ఒకవేళ తొందరలో జరిగే జీహెచ్ఎంసి ఎన్నికలలో కూడా బీజేపీ ఇటువంటి పెర్ఫార్మన్స్ ఇస్తే.. తెరాసకు డేంజర్ బెల్స్ మోగడం ఖాయం.

ఈ విజయంలో పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ పాత్ర ఏమీ లేనప్పటికీ… ఇందులోని పాజిటివ్ ని మాత్రం ఆ రాష్ట్ర యూనిట్ కూడా తీసుకుంటుంది. 2018 ఎన్నికలలో బీజేపీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వచ్చింది ఒక్క సీటే. తాము కూడా అలాగే ప్రభావం చూపించి బలపడతాం అని ఆ పార్టీ గాంబీర్యంగా చెప్పుకోవచ్చు.

అయితే తెలంగాణలో అక్కడి బీజేపీ నేతలు… బండి సంజయ్, అరవింద్, రఘునందన్ రావు విశేషంగా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఆ స్థాయి నేతలు లేరు. పైగా పార్టీ నాయకుడి నుండి కింద స్థాయి వరకు అధికారపక్ష కోవర్టులు అనిపించేలా వ్యవహరిస్తూ ఉంటారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది!