YS Jagan Raghu Ramakrishna Rajuఎంపీ రఘురామరాజు కాళ్లకు గాయాలు ఉన్నాయని, కుడికాలి వేలికి ఫ్రాక్చర్‌ అయిందని సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నివేదిక ఇవ్వడంతో రాజద్రోహం కేసులో అరెస్టయిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు బెయిల్ రావడం తేలికైంది. అయితే సుప్రీం కోర్టు తీర్పు కాపీ రాకపోవడంతో సోమవారమే ఆయన విడుదల అయ్యే అవకాశం ఉంది.

జైలు నుండి బయటకు రాగానే రఘురామ కృష్ణంరాజు ప్రభుత్వం మీద న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. ఒక్క కేసులో తనను అరెస్టు చేసి…. ఎంపీని అని కూడా చూడకుండా కొట్టించిన ప్రభుత్వం పై ఆయన ప్రతీకారంతో రగిలిపోతున్నారట. అయితే అందుకు ప్రభుత్వానికి సహకరించిన వారి పని కూడా పట్టడానికి ఆయన సిద్ధం అవుతున్నారట.

తన మీద పెట్టిన ఒక్క కేసుకు గానూ… కోర్టు థిక్కారం కేసు, కస్టడీలో ఉండగా కోట్టారనే కేసు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కేసు, పార్లమెంట్ సభ్యుడి హక్కులు ఉల్లంఘన కేసు, పరువు నష్టం కేసు, ఇలా కేసుల పైన కేసులు పెట్టడానికి సిద్ధం అవుతున్నారట. దీనితో సీఐడీ అధికారులకు, ఆయన పరిస్థితి మీద నివేదిక ఇచ్చిన మెడికల్ బోర్డు కు కంటి మీద కునుకులేకుండా పోయిందట.

ఈ విషయమై సీబీఐ దర్యాప్తు జరిపించాలని రఘురామ తరఫు న్యాయవాది ఇప్పటికే కోరారు, పైగా ఇదే డిమాండ్‌తో ఎంపీ తనయుడు భరత్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరుపనుండడంతో అధికారులకు టెన్షన్ మొదలయ్యిందట. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి తమ మెడకు చుట్టుకుంటుంటుందని వారు భయపడుతున్నారట.