Raghu Rama Rajuఎమ్మెల్యేలకు విలువా ఇంకా ఏమైనా… మొన్న ఒక ఎమ్మెల్యేను బేస్ బాల్ బ్యాట్ పెట్టి కొట్టేసారట – ఇది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం. గతంలో ‘సీఎస్’ను కూడా కొట్టబోయాడని వార్తలు వచ్చాయని, ‘పోకిరి’ సినిమాలో ‘గిల్లితే గిల్లించుకోవాలి’ అన్న మాదిరి ‘కొడితే కొట్టించుకోవాలేమో’ తెలియదు, కొట్టాడని అయితే టాక్.

ఎందుకంటే లోపలి వెళ్లి బయటకు వచ్చిన వ్యక్తికి కళ్ళజోడు విరిగింది, పెదవి వాచింది. మరి కళ్ళజోడు తనంతట తాను విరిగి, పెదవి దానంతట అది వాస్తే మనం చెప్పలేం గానీ, మొన్న ఉదయం లోపలికి వెళ్లిన ఎమ్మెల్యే కళ్ళజోడు విరగ్గొట్టుకుని వచ్చాడు. మరి అది తనంతట తను విరిగిపోయిందేమో నాకు తెలియదు అంటూ ఆర్ఆర్ఆర్ చెప్పిన సంగతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కేవలం చంద్రబాబుపై ఉన్న కక్ష్యతోనే నాడు కట్టిన మూడు లక్షల ఇళ్లను ఇవ్వలేదని, దేశంలో ఏ నాయకుడికి పట్టని సినిమా సంగతి ఒక్క మా వాడికే పడుతుందని, సినిమా పరిశ్రమ నుండి నోరు విప్పితే బట్టలు విప్పుతున్నాడని, ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ధైర్యంగా ఎదిరించాడని, అలాగే నాని కూడా చెప్పాడని, టాయిలెట్ కు వెళ్లే వాళ్లకి సినిమాను ఫ్రీగా చూపిస్తున్నాడని ఎద్దేవా చేసారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వ్యాఖ్యల పర్యవసానం ఎలా ఉందంటే… ఇంతకీ ఆర్ఆర్ఆర్ చెప్పిన ఆ ఎమ్మెల్యే ఎవరు? కళ్ళజోడు వాడే వైసీపీ ఎమ్మెల్యే ఎవరు? అన్న కోణంలో నెటిజన్లు పరిశోధిస్తున్నారు. అలాగే ఇటీవల జగన్ ను కలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఎవరు? అని కూడా సెర్చ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇంతకీ ఎవరై ఉంటారు?