raghu rama krishnam rajuపశ్చిమ గోదావరి వైఎస్సార్ కాంగ్రెస్ లో విబేధాలు భగ్గుమన్నాయి. జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం నుంచి జిల్లా ఇంచార్జ్ మంత్రి సమక్షంలోనే నర్సాపురం, ఏలూరు ఎంపీలు వాక్ అవుట్ చేశారు… వివరాలలోకి వెళ్తే…. మావేశ మందిరంలోకి ముందుగా వచ్చిన ఇన్‌చార్జి మంత్రి పేర్ని నాని, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, కలెక్టర్‌ ముత్యాలరాజు వేదికపై ఆశీనులయ్యారు.

ఆ తరువాత వచ్చిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా వేదికపై ఆశీనులయ్యారు. అనంతరం వచ్చిన ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, మార్గాని భరత్‌ వేదిక ముందు మొదటి వరుసలో కూర్చున్నారు. అయితే ఆ తరువాత సమావేశం మొదలు కాగానే రఘురామకృష్ణంరాజు వేదిక దిగి వెళ్లిపోయారు…. ఏలూరు ఎంపీ కోటగిరి కూడా ఆయన్ని అనుసరించారు.

ఎంపీలు వేదిక మీద కూర్చోకూడదని రఘురామకృష్ణంరాజుకు చెప్పడంతో ఆయన నొచ్చుకుని వెళ్ళిపోయారట. ఇదే అంశంపై సమావేశంలోనే ఉన్న మరో ఎంపీ మార్గాని భరత్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే మంత్రి ఆళ్ల నాని మాత్రం తాము ప్రోటోకాల్ ఫాలో అవుతున్నామని, లేదని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు.

రఘురామ కృష్ణంరాజు ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ… ఎంపీగా తాను డయాస్‌ మీద లేకుండా అధికారులు ఉండటంతో కలత చెందానన్నారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారుల కంటే తామే ఎక్కువన్నారు. కాదు అధికారులు తమ కంటే ఎక్కవని నిబంధనలు చెబితే.. తాను అలాంటి మీటింగ్‌లకు ఇకమీదట వెళ్లబోమన్నారు. దీనికి ఇంఛార్జ్ మంత్రి క్షమాపణ చెబుతున్నారని అనుకుంటున్నా అని ఆయన అనడం గమనార్హం.