విజయసాయిరెడ్డి : గుడ్డ కాల్చి మొహాన వేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే అనుకుంటున్నాడు. ఢిల్లీలో కూర్చొని ‘నన్ను చంపేస్తారు’ అని ఏడుపు మొదలెట్టాడు. నర్సాపురం ప్రజలకు మొహం చూపించలేకే ఈ పబ్లిసిటీ స్టంట్. చీప్ పబ్లిసిటీ వస్తుందంటే చివరకు గోదాట్లోకైనా దూకి నన్ను ఎవరో తోసేశారు అనే రకం.
రఘురామకృష్ణంరాజు : వీడిని విశాఖ నుంచి గెంటేసి అండమాన్ కి పంపిస్తే మళ్ళీ వచ్చేసాడు. ఎన్ని సార్లు ముఖ్యమంత్రి చేతిలో తన్నులు తిన్నా సిగ్గులేదు వీడికి. రేపో మాపో వీడు కూడా నా దారి పడతాడు. Let us wait and see!
ట్విట్టర్ వేదికగా సాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఆర్ఆర్ఆర్. ఏపీకి రావాలంటే రఘురామకు భయం అంటూ జగన్ మీడియా అండ్ కో తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్న నేపధ్యంలో వాటిని అంతే స్థాయిలో తిప్పికొట్టడానికి ఆర్ఆర్ఆర్ ప్రయత్నిస్తున్నారు.
గతంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లిన జగన్ పై టీఆర్ఎస్ వర్గాలు నాలుగు రాళ్లు విసిరితే భయపడి తిరుగుముఖం పట్టాడు, అది భయం అంటే, మళ్ళీ అక్కడికి వెళ్లలేక తన చెల్లిని పంపించాడు అంటూ రఘురామ కూడా వైసీపీ వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు.
అయితే తాజా ట్వీట్ లో ఓ అడుగు ముందుకేసి, ఏకంగా ముఖ్యమంత్రి చేతిలో తన్నులు తిన్నారంటూ విజయసాయిపై తీవ్ర ఆరోపణలు చేసారు. సహజంగా ప్రత్యర్థి వర్గాలపై ట్వీట్లతో విరుచుకుపడే సాయిరెడ్డి, ఇంకా ఆర్ఆర్ఆర్ ట్వీట్ కు ప్రతిస్పందన ఇవ్వలేదు.
వీడిని విశాఖ నుంచి గెంటేసి అండమాన్ కి పంపిస్తే మళ్ళీ వచ్చేసాడు. ఎన్ని సార్లు ముఖ్యమంత్రి చేతిలో తన్నులు తిన్నా సిగ్గులేదు వీడికి. రేపో మాపో వీడు కూడా నా దారి పడతాడు. Let us wait and see!😁😁 https://t.co/I5anMCOJYP
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) January 16, 2022
NTR Arts: Terrified NTR Fans Can Relax!
TFI Supporters Of Jagan: Risked Careers, Got Cheated