raghu rama krishnam raju comments on yrrcp partyఏపీ సీఎంతో గత రెండేళ్లుగా నిర్విరామంగా పోరాడుతోన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కధ క్లైమాక్స్ కు చేరుకుంది. తనను డిస్ క్వాలిఫై చేసే శక్తి తాను ఎంతగానో ప్రేమించే వైసీపీ వద్ద లేదని అన్న ఆర్ఆర్ఆర్, త్వరలోనే తాను ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ ప్రకటన రాగానే జగన్ వర్గపు మీడియాలో ఓ దుష్ప్రచారం ఊపందుకుందని, పార్టీ ఎలాగూ సస్పెండ్ చేస్తుందని భావించి, భయంతోనే రఘురామకృష్ణంరాజు పార్టీని వీడుతున్నారని ప్రచారం చేస్తున్నారని, ఇది నాకు ఏ మాత్రం నచ్చలేదని ఈ సందర్భంగా సవాల్ విసిరారు ఆర్ఆర్ఆర్.

ఈ పదజాలం నాకు నచ్చలేదు గనుక, పార్టీకి తాను రెండు వారాల పాటు సమయం ఇస్తున్నానని, ఏ రకంగా అయినా తనను డిస్ క్వాలిఫై చేసే దమ్ముంటే చేయొచ్చని, కానీ ఆర్టికల్ 10 ప్రకారం వాళ్ళు నన్నేమి చేయలేరని, అసలు విషయం ఏమిటంటే వాళ్లకు చట్టాలు తెలియవని అన్నారు.

చట్టాలు తెలియవు, చట్టాలను గౌరవించడం తెలియదు, అసలు వీళ్లకు ఏమి అవగాహన లేదని నేను నిరూపిస్తానని ఓ మీడియాలో తన భావాలను పంచుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి మగాడైతే నన్ను పార్టీ నుండి డిస్ క్వాలిఫై చేయాలని అన్న ఆర్ఆర్ఆర్, ఒకవేళ అలా చేయని పక్షంలో తాను పార్టీకి రాజీనామా చేస్తానని అన్నారు.

ఇప్పటికిప్పుడు రాజీనామా చేయడానికైనా తాను సిద్ధమేనని, అయితే మేము ఏం చేయలేమని వైసీపీ బహిరంగంగా ఓ లేఖ ద్వారా గానీ, మీడియా ముఖంగా గానీ ప్రకటిస్తే తాను వెనువెంటనే రాజీనామా చేసేస్తానని అన్నారు. చట్టాలను తెలుసుకుని, వాటిని గౌరవించడం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేర్చుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.