Kanumuru Raghu Rama Krishna Raju - YS Jaganప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వారిని ఇరుకునపెట్టడం ప్రతిపక్షాల పని. అయితే అన్నివేళల… ప్రతిపక్ష పార్టీలు అంత యాక్టీవ్ గా ఉండవు. ఒక్కోసారి ఉన్నా ప్రతిసారీ ప్రభావితం చెయ్యలేవు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీల కంటే కూడా వైఎస్సార్ కాంగ్రెస్ రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు బాగా పని చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

అసమ్మతిగళంగా మొదలైన ఆర్ఆర్ఆర్ చాలా కొద్ది సమయంలోనే ప్రభుత్వానికి ఏకు మేకై కూర్చుకున్నారు. రచ్చబండ పేరిట ప్రభుత్వ విధానాలను నిత్యం తప్పుబడుతూ… ఏకంగా ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చెయ్యాలని న్యాయపోరాటం మొదలుపెట్టారు. అలాగే ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలపై కోర్టుల్లో సవాలు కూడా చేస్తున్నారు.

దానితో ఆయన పుట్టినరోజునే జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అలాగే జైలులో తనపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని వారు ఆయన ఆరోపించారు. విచారణ సమయంలో జరిగిన దాడి గూర్చి జాతీయస్థాయిలో సర్కార్ని దోషిగా నిలబెడుతూ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తున్నారు. అదే సమయంలో న్యాయపోరాటం కూడా కొనసాగిస్తున్నారు.

ఏ పని చేసిన దేశం మొత్తం తిరిగి చూడాలి అని ఆరాటపడే ముఖ్యమంత్రికి వివిధ రాష్ట్రాల ఎంపీలు ఆర్ఆర్ఆర్ కు మద్దతు తెలుపుతుంటే జగన్ కు ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. మొత్తానికి ఒక్కో అస్త్రాన్ని సంధిస్తూ అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆర్ఆర్ఆర్ నిజంగా గనుక జగన్ బెయిల్ రద్దు చేస్తే ఈ పోరాటంలో విజయం సాధించినట్టే.