Raghu Rama Krishna Raju takes support from central ministerజగన్ ప్రభుత్వం చేతిలో పరాభవం చెందిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు… ఈ సారి జగన్ పై కోర్టుల ద్వారానే పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు ఆయన కేంద్రం మద్దతు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఆర్మీ ఆసుపత్రి నుండి ఆయన డిశ్చార్జ్ కాగానే ఢిల్లీ వెళ్లి ఎయిమ్స్ లో చేరిపోయారు. వెంటనే ఆయనకు కేంద్ర వైద్యారోగ్య మంత్రి హర్షవర్ధన్ టచ్ లోకి వెళ్లారు.

ఎయిమ్స్ లో డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూశారు సదరు మంత్రి. ఈరోజు రఘురామ కృష్ణం రాజు మరో కేంద్ర మంత్రి రాజనాధ్ సింగ్ ని కలిసి తనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అప్పాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారని సమాచారం.

తాను ఒంటరిని కాదని… తన జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే మెస్సేజ్ ఇస్తున్నారు రఘురామ. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుందో చూడాలి. ఒకవేళ మోడీ-షాల అప్పాయింట్మెంట్ ఇచ్చినట్టు అయితే ఆయన తో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించే అవకాశం లేదు.

మరోవైపు తన అరెస్ట్ సమయంలో ఓ ప్రజాప్రతినిధిని అరెస్టు చేసే సమయంలో పొరుగు రాష్ట్రం పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలను, మార్గదర్శకాలను హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పట్టించుకోలేదని ఆర్ఆర్ఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కంప్లయింట్ చేస్తూ ఒక లేఖ రాశారు.