Raghu-Rama-Raghu‘వన్ టైం సెటిల్మెంట్’ పేరుతో ఇంటికో 10 వేలు కట్టండి, మీ ఇల్లు తాకట్టు పెట్టుకోండి, అమ్ముకోండి, విలువ పెంచుకోండి… అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలు కల్లబొల్లి కబుర్లే అన్న విషయం తేటతెల్లమవుతోంది. ఈ ఓటీఎస్ పధకానికి ప్రజల దగ్గర నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, లోన్లు వస్తాయనే ఆశతో కొంతమంది ఏపీ సర్కార్ కు 10 వేలు చెల్లించి పట్టా తెచ్చుకున్నారు.

కానీ ఈ పట్టాలు రుణాలు ఇవ్వడానికి పనికి రావంటూ బ్యాంకులు తిరస్కరిస్తుండడంతో ఏపీ సర్కార్ పై మళ్ళీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాధారణంగా బ్యాంకులు రుణాలు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న వాటికే ఇస్తుంటాయి, దానికి కూడా లీగల్ ప్రొసిడింగ్స్ ఉంటాయి. కానీ ఓ జగన్ ఫోటోతో ఇస్తోన్న ఏపీ సర్కార్ పట్టా రిజిస్ట్రేషన్ పరిధిలోకి రాకపోవడంతో బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి.

సబ్ రిజిస్ట్రార్ సంతకం లేకుండా రిజిస్ట్రేషన్ అంటే ఉపయోగం ఉండదని బ్యాంకర్లు ప్రజలకు వివరిస్తుంటే, ఇదంతా అవగాహన లేని సామాన్య ప్రజలు విస్తుపోతున్నారు. జగన్ ఫోటో ముద్రించి ప్రజల చేతికిచ్చిన పట్టా చట్టపరంగా ఏ మాత్రం విలువ లేనిదిగా మారిపోవడం అనేది ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

నిజానికి ఈ ఓటీఎస్ పధకం పేరుతో జగన్ సర్కార్ ఇచ్చే పట్టాపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ముందుగానే ప్రజలకు చెప్పారు. ఈయన ఫోటో వేసుకుని ఇస్తోన్న ఈ పట్టాకు ఏ మాత్రం విలువ ఉండదని, దీనిని పట్టుకుని ముందుకెళిత్ చట్టపరంగా, న్యాయపరంగా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రజలను హెచ్చరించారు.

అయితే జగన్ సర్కార్ పదే పదే చెప్పడంతో, గంపెడాశతో ఓటీఎస్ కట్టి బ్యాంకుల వద్దకు వెళుతున్న వారికి ఇప్పుడు పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు, మునిసిపాలిటీలలో 15వేలు, కార్పొరేషన్ లలో 20 వేలు చొప్పున ఈ ఓటీఎస్ పేరుతో వసూలు చేసారు. ఇప్పటికీ ఓటీఎస్ పేరుతో డబ్బులు కట్టాలని ప్రభుత్వ అధికారులు ప్రజలను వెన్నాడుతున్నారు.