Raghu Rama Krishna Raju JAganరాజద్రోహం కేసులో అరెస్టయిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు దాదాపుగా పదిహేను రోజుల పాటు సోషల్ మీడియా, మీడియాకు దూరంగా ఉండిపోయారు. ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని ఆయనను సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఇక మీడియా ముందు కు రారని ఆ విధంగా ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్ లో జగన్ పై చెయ్యి సాధించినట్టే అని అంతా భావించారు.

అయితే ఆయన సోషల్ మీడియా ముందుకు వచ్చారు. మొదటిగా తన విడుదల కోసం, తన క్షేమం కోసం ప్రార్దించినవారికి థాంక్స్ చెప్పడంతో మొదలుపెట్టారు. ఆ తరువాత జైలు బెయిల్ రద్దు కేసులో ముఖ్యమంత్రి వేసిన కౌంటర్ గురించి స్పందించారు. జగన్ కౌంటర్‌ పేలవంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే బెయిల్ రద్దు పిటిషన్‌ దాఖలులో తనకు ఏ స్వార్థం లేదని….కచ్చితంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నా అని ఆయన అన్నారు. పైనున్న వెంకటేశ్వరస్వామి అన్నీ చూసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగే జగన్‌ కౌంటర్‌లో తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు ఆయన.

ఇది ఇలా ఉండగా.. గతంలో రఘురామ ఇటువంటి వీడియోలలో చాలా అగ్రెసివ్ గా మాట్లాడేవారు.. కొంత కంట్రోల్ తప్పి మాట తూలేవారు. దానివల్లే రాజద్రోహం కేసులో కూడా ఇరుక్కున్నారు. అయితే తాజా వీడియోలో ఆయన చాలా ఆచితూచి స్పందించడం కనిపించింది. ఎక్కడా కూడా మాట తూలకుండా మాట్లాడారు. ఇటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తే… జగన్ ప్రభుత్వానికి రఘురామ మరింత డేంజర్ గా పరిణమించవచ్చు.