Raghu Rama Krishna Raju notices to APCIDఎంపీ రఘురామ కృష్ణంరాజు కేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన అరెస్ట్‌ సమయంలో పోలీసులు తీసుకున్న ఐ-ఫోన్‌ను రికార్డుల్లో ఎక్కడా చూపలేదని… తక్షణమే తన ఫోన్‌ను తిరిగి ఇవ్వాలంటూ సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్‌కు రఘురామ లీగల్‌ నోటీసు ఇచ్చారు.

ఫోన్‌లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు, అలాగే అంతేకాకుండా స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తనకు సంబంధించిన చాలా విలువైన సమాచారం కీలక సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. అయితే బయటకు వచ్చిన కాసేపటికి…. మాజీ ఐఏఎస్ అధికారి అలాగే గతంలో ముఖ్యమంత్రి జగన్ కు సలహాదారుడిగా పని చేసిన పీవీ రమేష్ తన కుటుంబసభ్యులకు ఎంపీ ఫోన్ నెంబర్ నుండి కొన్ని మెస్సేజ్లు వస్తున్నాయని… ఎంపీ స్పందించాలని కోరారు.

అయితే మే 14 నుండి జూన్ 1 వరకు తన ఫోన్ తాను వాడలేదని, నాలుగురోజుల క్రితమే కొత్త సిమ్ తీసుకున్నా అని రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ఆ మెస్సేజ్లతో తనకు సంబంధం లేదని, లీగల్ ప్రొసీడ్ అవ్వమని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పీవీ రమేష్ అసంతృప్తిగానే ఏపీ సీఎంవో నుండి వైదొలిగారు.

ఆయనకు సీఐడీ అధీనంలో ఉన్న ఫోన్ నుండి ఏం మెస్సేజ్లు వెళ్లి ఉండవచ్చు. సాధారణ మెస్సేజ్ అయితే మాజీ ఐఏఎస్ అధికారి సోషల్ మీడియాలో ప్రకటించే అవకాశాలు తక్కువ.ఏమైనా అసభ్యకరమైన మెస్సేజ్లు వెళ్లాయా? లేక ఏమైనా కీలక విషయాల పై మెస్సేజ్లు వెళ్లాయి. అసలు సిఐడీ కస్టడీలో ఉన్న ఫోన్ నుండి ఏ విధమైన మెస్సేజ్లు ఎందుకు వెళ్లాయి. అలా వెళ్లినట్టు బహిరంగపరచడం వ్యూహాత్మకంగా జరిగిందా అంటూ చర్చ జరుగుతుంది.