రాజద్రోహం కేసులో బెయిల్ పై విడుదలైన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. అయితే గతంలో లాగా ఆవేశంగా కాకుండా ఆలోచనతో జగన్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వాన్ని లీగల్ గానూ అటు రాజకీయంగానూ తన చేతికి మట్టి అంటకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

లీగల్ గా జగన్ బెయిల్ రద్దు కేసు ఉండనే ఉంది. ఇక రాజకీయంగా జగన్ కు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. అందులో మొదటిది బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం కాగా…. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలకు తన పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గురించి లేఖ రాసి విమరించారు.

తన అరెస్ట్‌ తదనంతర పరిణామాలను వివరిస్తూ ఆయన లేఖ రాశారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు. దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు. సహజంగా తాను ఏ పని చేసినా దేశం మొత్తం చూడాలని జగన్ తాపత్రయపడుతూ ఉండరు.

అందుకోసమే కొన్ని కొన్ని పథకాలకు సంబంధించిన ప్రకటనలు పక్క రాష్ట్రాలలో కూడా ఇస్తూ ఉంటారు. అటువంటి సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలకు పార్టీలకతీతంగా లేఖలు రాయడమంటే జగన్ ఈగో మీద కొట్టినట్టే. దీనికి జగన్ ప్రభుత్వం ఎలా స్పందించబోతుందో చూడాలి.