Raghu Rama Krishna Raju Will Repent The Mistake Forever!సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీం కోర్టు ఎంపీ రఘురామకృష్ణంరాజు కు బెయిల్ మంజూరు చేసింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని పేర్కొంది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్ తీసుకోవాలని సూచించింది.

సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి రిపోర్టులో రఘురామకృష్ణంరాజు కు ఎడమ కాలి వేలుకి ఫ్రాక్చర్ ఉందని తేలడంతో సీఐడీ కస్టడీలో ఎంపీని మాన్ హ్యాండిల్ చేశారు అనేదానికి బలం చేకూరినట్టు అయ్యింది. అది బెయిల్ రావడానికి కూడా దోహదం చేసింది. ఇకపోతే… ఈ మొత్తం ఎపిసోడ్ లో అధికార పార్టీకి ఒక చిన్నపాటి మంచి జరిగింది.

ఈరోజు మొత్తంగా ప్రభుత్వానికి రెండు వ్యతిరేక తీర్పులు వచ్చాయి. హై కోర్టు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రద్దు చెయ్యడం, ఇప్పుడు ఈ తీర్పు… అయితే రఘురామకృష్ణంరాజు ను ఈ కేసు తేలేవరకూ మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూలతో రఘురామకృష్ణంరాజు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేవారు.

మీడియా కూడా ఆయన ఇంటర్వ్యూలకు ఎక్కువ కవరేజ్ ఇచ్చేది. ప్రతిపక్షాల కంటే ఆయన పోరే ఎక్కువగా ఉండేది. పైగా సొంత పార్టీ ఎంపీ కావడంతో ప్రజలలో చర్చ కూడా ఎక్కువగా జరిగేది. ఒకరకంగా ఈ కేసు తేలేవరకు ప్రభుత్వానికి ఆ పోరు తప్పినట్టే. కావున ఇది మంచి వార్తే అని చెప్పుకోవాలి.