raghu rama krishna raju‘జగనన్న సంపూర్ణ శాశ్వత గృహ పథకం’ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయంటే, ఏ స్థాయిలో ప్రజలను ఆకర్షించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘కేవలం పది రూపాయలకే’ ప్రతి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని జగన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు… టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా ఎప్పుడు పాస్ అయినా కూడా తాను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానని చెప్పారని, ‘క్లాస్ ఫస్ట్’ అనలేదు సంతోషం, అంతవరకు నిజమే అనుకుందాం, అంత ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వ్యక్తికి పది రూపాయలకు, పది వేలకు తేడా తెలియదని ఎలా అనుకుంటారు, ఆయన నిజంగా మంచి మనసుతో పది రూపాయలు అని చెప్పారు.

క కింద క ఒత్తు ఇచ్చి మరీ ‘క్కేవలం 10 రూపాయలు’ అని చెప్పిన తర్వాత కూడా ఈ దిక్కుమాలిన అధికారులు ఎందుకు 10 వేలు సేకరిస్తున్నారు? ఒకవేళ పొరపాటున చెప్పినా కూడా ఆయన చెప్పారంటే అది ‘షిలా శాసనం,’ అధికారులు అందరూ పాటించాల్సిందేనని అన్నారు. 52 లక్షల మందిలో ఇప్పటికే ఓ 3 లక్షల మంది ముఖ్యమంత్రి గారి పాలసీకి వ్యతిరేకంగా 10 వేలు కట్టారట, వీరందరికి కూడా క్కేవలం 10 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు.

ఎవరైనా శుభం పలకరా అంటే పెళ్లికొచ్చి దినం అన్నారంట… ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తరతరాలు ఉండాలని అనుకుంటారు గానీ, ఇక్కడేమో పెళ్లికొచ్చి విడాకులు తీసుకుంటే ఇలా ఉంటుందని, నీకు యాక్సిడెంట్ అయిపోతే ఇంత వస్తుందన్న ఇన్సూరెన్సు ఏజెంట్ లాగా, అసలేంటి ఈ దిక్కుమాలిన సలహాలు? అమ్ముకోవాలంటే పత్రం ఇస్తానంటాడా? ఎవరికి కావాలి ఈ పత్రం?

ఎవరైనా అమ్ముకోవాలంటే వాళ్ళ దగ్గర కట్టించుకోండి, ప్రభుత్వానికి చెప్తున్నాను, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నేను చెప్పడం లేదు, ఈ దిక్కుమాలిన ప్రతిపాదన తీసుకొచ్చిన వాళ్లకి చెప్తున్నాను, మా ముఖ్యమంత్రికి రాలేదు ఈ దరిద్రపు ఆలోచన, మా ముఖ్యమంత్రికి రాలేదు ఈ దుర్మార్గపు ఆలోచన, మా ముఖ్యమంత్రి అయితే 10 రూపాయలే అంటున్నాడు.

ఈ 10 వేలు అని చెప్పిన దరిద్రుడికి చెప్తున్నా, తప్పు అది, సీఎం మాటలను పాటించండి, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. మా ముఖ్యమంత్రిది జాలి హృదయం కాబట్టి, ఐస్ క్రీం కన్నా ఫాస్ట్ గా కరిగిపోతుంది కాబట్టి, ఆ 10 రూపాయలు తీసుకుని వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయండి, అంతేగాని ఇల్లు అమ్ముకోవడానికి పని చేస్తుందనే ఇన్సూరెన్సు ఏజెంట్ లాగా ఏంటి ఈ దరిద్రం అని ప్రజలు నాకు ఫోన్ చేస్తున్నారు.

మళ్ళీ చెప్తున్నా… దయచేసి మా ముఖ్యమంత్రి గారిని ఫాలో అవ్వండి, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఆర్ఆర్ఆర్ మరోసారి తనదైన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. మా ముఖ్యమంత్రిని అప్రతిష్ట పాలు చేయడానికి ఇన్ని చెత్త పనులు చేస్తున్నారని రోజూ నిర్వహించే ‘రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు గారు వ్యాఖ్యానించారు.