Radheshyam ee rathale full song on february 25thమార్చి 11వ తేదీన విడుదలకు నోచుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” చిత్ర యూనిట్ ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడంతో, ఇటీవల అభిమానులు ట్విట్టర్ లో బాయ్ కాట్ యువీ క్రియేషన్స్ అంటూ ఓ ట్రెండ్ కూడా చేసారు. అంతలా ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షించిన చిత్ర యూనిట్ ఎట్టకేలకు తమ తదుపరి ప్రమోషన్స్ తేదీని ప్రకటించింది.

“రాధే శ్యామ్”లో సూపర్ హిట్ గా నిలిచిన “ఈ రాతలే” వీడియో సాంగ్ ప్రోమోను గురువారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు ఈ పాట పూర్తి వీడియో సాంగ్ ను కూడా విడుదల చేయబోతున్నారు. “భీమ్లా నాయక్” విడుదల తేదీ అయిన 25వ తేదీన ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఎట్టకేలకు “రాధే శ్యామ్” నుండి అప్ డేట్ రావడంతో, ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేగాక సూపర్ హిట్ గా నిలిచిన వీడియో సాంగ్ వస్తుండడంతో, అంచనాలు పెంచుతుందని ఆశిస్తున్నారు. ఈ పాటను మొత్తం 5 భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. బుడ్డి పాపకు బెలూన్ ఇస్తూ నిల్చున్న స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మొత్తం అయిదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 11వ తేదీన విడుదల కానుంది. జ్యోతిష్యానికి – డెస్టినీని ముడిపెడుతూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. ముఖ్యంగా సినిమాలోని ప్రతి షాట్ కూడా ‘విజువల్ వండర్’ అన్న అనుభూతిని ప్రేక్షకులకు పంచింది.