Radhe-Shyam-glimpseయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో నాలుగు చిత్రాలు ఉన్నాయి – రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, మరియు నాగ్ అశ్విన్ చిత్రం. రాధే శ్యామ్ మినహా మిగతా అన్ని చిత్రాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఆదిపురుష్ ప్రభాస్ మొదటి స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా. సలార్ కేజీఎఫ్ తో దేశం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్న దర్శకుడి సినిమా. నాగ్ అశ్విన్ మహానటి వంటి అద్భుతమైన సినిమాను తీసిన దర్శకుడు.

ఒక రకంగా చెప్పాలంటే, రాధే శ్యామ్ ప్రభాస్ లైనప్‌లో బలహీనమైన సినిమా అని చెప్పుకోవాలి. దీనికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన మొదటి చిత్రం విఫలమైంది. దానితో రాధే శ్యామ్ మీద ప్రస్తుతానికి అంచనాలు తక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ఈ నెల 14 న వాలెంటైన్స్ డే స్పెషల్ గా విడుదల కానుంది.

టీజర్ ని బట్టి చిత్రం ఏమిటీ అనే ఒక అంచనాకు రావొచ్చు. రాధే శ్యామ్ గనుక హిట్ అయితే ప్రభాస్ ఇక తిరిగి చూసుకునే పని ఉండదు. రాధే శ్యామ్ 1960 లలో ఐరోపా నేపథ్యంలో ఒక పీరియడ్ ఫిల్మ్ అని సమాచారం. చాలా కాలం తరువాత ప్రభాస్ ఒక లవ్ స్టోరీ లో కనిపించబోతున్నాడు.

బాహుబలి నుండి ప్రభాస్ ప్రతి చిత్రం లాగా ఇది పాన్-ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. టీజర్‌తో పాటు విడుదల తేదీని మేకర్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదల కానుండడంతో డేట్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. రాధే శ్యామ్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.