raasi lanka about her struggles in shooting spotతెలుగు చిత్ర సీమలో అందాల బొమ్మగా అలరించిన రాశి, ప్రస్తుతం థర్డ్ ఇన్నింగ్స్ పై దృష్టి సారించింది. చిన్నతనంలోనే పలు చిత్రాలలో నటించి మొదటి ఇన్నింగ్స్ ముగించుకుని, హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను ఘనంగా పూర్తి చేసిన రాశి, వివాహమైన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తాజాగా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తున్న రాశి, “లంక” సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రాశి, తన సినీ కెరీర్ లో ఉన్న హీరోయిన్ల పరిస్థితికి, ఇప్పటి హీరోయిన్ల పరిస్థితికి గల వ్యత్యాసాన్ని వివరించింది. ఈ రోజుల్లో హీరోయిన్లకు అన్ని సదుపాయాలు ఉన్నాయని… కార్ వ్యాన్ లు ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బంది కలగడం లేదని, అయితే తాము హీరోయిన్లుగా చేసే రోజుల్లో ఈ సౌకర్యాలు ఉండేవి కావని వాపోయింది.

షూటింగ్ విరామంలో ఏ చెట్టు కింద నీడ ఉందా… అని వెతుక్కునే వాళ్లమని, చెట్ల కిందే ఫ్యాన్ లు, కూలర్లు పెట్టుకుని కూర్చునేవారమని చెప్పింది. ఊటీ లాంటి ప్రాంతాలకు ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లినప్పుడు ఆరు బయటే దుస్తులు మార్చుకోవాల్సి వచ్చేదని, అలాంటి సమయంలో తమకు తప్పేది కాదని, కానీ ఇప్పటి హీరోయిన్లకు ఈ బాధలు లేవని… తన తరానికి, ఈ తరానికి గల తేడాను సవివరంగా చెప్పింది.