raana to do leader2టాప్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీనువైట్ల ఆ తర్వాత వెంట వెంటనే ‘బాద్‌షా’, ‘ఆగడు’, ‘బ్రూస్‌లీ’ చిత్రాలు ఫ్లాప్‌ అవ్వడంతో స్టార్‌డమ్‌ను కోల్పోయాడు. దాంతో ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఏ ఒక్క స్టార్‌ హీరో కూడా ముందుకు రాలేదు. ‘బ్రూస్‌లీ’ సినిమా తర్వాత ఈయన కెరీర్‌ సందిగ్దంలోకి పడటం జరిగింది. ఈయన ‘బ్రూస్‌లీ’ విడుదల తర్వాత రవితేజ, రామ్‌లను కలిసేందుకు ప్రత్నించాడు. కాని వారు బిజీగా ఉన్నాం అంటూ సమాధానం చెప్పారు. ఇంకా పలువురు హీరోలను ఈయన సంప్రదించే ప్రయత్నాలు చేశాడు. కాని వర్కౌట్‌ అవ్వలేదు.

చివరకు శ్రీనువైట్ల దర్శకత్వంలో రానా నటించేందుకు ఓకే చెప్పాడు. తాజాగా రానాతో శ్రీనువైట్ల మాట్లాడటం జరిగిందట. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్‌ు పూర్తి అవ్వగానే శ్రీనువైట్ల దర్శకత్వంలో నటించేందుకు రానా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఒక పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ కథను సిద్దం చేయాల్సిందిగా శ్రీనువైట్లతో రానా చెప్పినట్లుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం వేసవి తర్వాత శ్రీనువైట్లకు రానా డేట్లు ఇచ్చినట్లుగా కూడా సమాచారం అందుతోంది. దాంతో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో శ్రీనువైట్ల ఒక మంచి స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. రానాతో చేయబోతున్న సినిమాతో శ్రీనువైట్ల మళ్లీ పున: వైభవంను దక్కించుకుంటాడో చూడాలి.