r krishnaiah opposes kapu reservationకాపులను బీసీల్లో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బిల్లును తీసుకురావడంపై బీసీ సంఘాల నాయకుడు ఆర్. కృష్ణయ్య ఖండించారు. దీనిపై బీసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోనే తిరగబడాలని పిలుపునిచ్చారు. దానికి స్పందించి రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమొదురు నిరసనలు జరిగాయి. అయితే కృష్ణయ్యది అర్ధం లేని ఆవేశంగానే కనిపిస్తుంది.

ప్రస్తుతం బీసీలకు 29% రిజర్వేషన్లు ఉన్నాయి. వీటిని యధాతధంగా కొనసాగిస్తూ కాపులకు మరో 5% రిజర్వేషన్లు ఇచ్చారు. దీనిబట్టి ఇప్పటిదాకా ఉన్న బీసీలకు నష్టం లేదనే చెప్పుకోవాలి. మరి కృష్ణయ్య ఆందోళన దేనికో అర్ధం కానీ విషయం. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీద గెలిచిన కృష్ణయ్య తరువాతి కాలంలో స్వపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తున్నారు.

అందులో భాగంగానే టీడీపీని ఇరుకునపెట్టే ప్రయత్నమయ్యి ఉండవొచ్చు. కాపు రిజర్వేషన్ల కేంద్రమైన కాకినాడలోని కలెక్టరేట్‌ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను బీసీ సంఘాలు దగ్ధం చేశాయి. టైర్లకు నిప్పు అంటించి రోడ్డుపై వేయడంతో కలెక్టరేట్‌ వైపు నుంచి వెళ్తున్న రవాణా వ్యవస్థను స్తంభించింది. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల వెనుకబడిన తరగతుల వర్గాల వారికి నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆరోపించాయి.