Shahid-Afridi-Qandeel-Baloch2011 ప్రపంచ కప్ సందర్భంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పూనం పాండే ఉదంతం తెలియనిది కాదు. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే ఫ్రీ ‘న్యూడ్’ షోను ఆఫర్ చేసి ఒక్కసారిగా మీడియా వర్గాలను ఆకర్షించిన పూనం పాండే, అప్పటి నుండి తన కెరీర్ రూపురేఖలను మార్చుకోగలగడంలో విజయవంతమయ్యింది. అయితే ఆ తర్వాత పూనం పాండే న్యూడ్ షో ఇచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే, అప్పటివరకు ఒక మోడల్ గా ఇండస్ట్రీ వర్గాలకు మాత్రమే తెలిసిన పూనంకు అప్పటినుండి సోషల్ మీడియాలో అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.

ప్రస్తుతం ఈ కనికట్టునే పాకిస్తాన్ మోడల్ క్వాండిల్ బలోచ్ ప్రదర్శిస్తోంది. టీ 20 వరల్డ్ కప్ లో భారత జట్టుతో తలపడనున్న పాకిస్తాన్ జట్టు, ఈ మ్యాచ్ లో టీమిండియాను మట్టికరిపిస్తే… తానూ ‘స్ట్రిప్ డ్యాన్స్’ వేస్తానని సోషల్ మీడియాలో ప్రకటించి సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు, ఇదంతా పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అంకితమిస్తానని, ఒకేఒక్కసారి ఈ సారి ఇండియాను ఓడించమంటూ షాహిద్ అఫ్రిదిని వేడుకుంది కూడా ఈ బ్యూటీ. గతంలో పూనం ప్రకటించిన ఆఫర్ కు భారత్ ప్రపంచ కప్ ను అందుకోవడంతో ఇలాంటి ఆఫర్ టీమిండియా పాలిట శాపం అవుతుందేమో అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.