Arun Jaitley1000 సార్లు ఒకేమాట చెబితే అబద్దం నిజం అవుతాది అనుకుంటున్నారేమో బీజేపీ వారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయం గురించి ప్రజలకు చెప్పుకోవడంలో తాము విఫలమయ్యామని. రాష్ట్రానికి కేంద్రం ఏం సాయం చేసింది.. ముందు తమ పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించి.. సభలు పెట్టి ప్రజలకు తెలియజేయడానికి చూస్తుందట రాష్ట్ర బీజేపీ.

బడ్జెట్‌ సమావేశాల్లోపే ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని విజయవాడకు తీసుకొచ్చి, జైట్లీ ద్వారానే.. కేంద్రం, రాష్ట్రానికి చేసిన సహాయాన్ని ప్రజలకు వివరిస్తామని మంత్రి మాణిక్యాల రావు అంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా త్వరలో రాయలసీమలో పర్యటించనున్నట్లు తెలిపారు.

ఇప్పుడు వీరిద్దరితో పార్లమెంట్ లో పదే పదే చెప్పే రొటీన్ మాటలు … ఆంధ్రప్రదేశ్ మాకు స్పెషల్…. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…. ఆంధ్రప్రదేశ్ కు 2-3-4 లక్షల కోట్లు ఇచ్చేశాం… లాంటి ఉత్త మాటలు మళ్లీ చెప్పిస్తారన్నమాట. అసలు ఈ వృథా ప్రసంగాల వల్ల ఏపీకి సరే కనీసం బీజేపీకైనా ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రజలకు ఇదో రకమైన టార్చర్ అన్నమాట!