Pydikondala Manikyala Raoఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ తో బీజేపీ కోటాలో మంత్రి అయిపోయారు. మొదటినుండి ఆయనకు మిత్రపక్షమైన టీడీపీ అంటే పడదు నియోజకవర్గంలో వైకాపా నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. ఇటీవలే ఆయన శైలి మరీ వివాదాస్పదం అయ్యింది.

విజయవాడ కనకదుర్గ గుడిలో క్షుద్ర పూజల అంశం, గజల్ శ్రీనివాస్ ను వెనకేసుకొని రావడంతో ఆయనను తప్పించాలని ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెరిగింది. దీనికి ఆయన ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు. నిన్నటిరోజున జన్మభూమి సభలో ఏకంగా ప్రభుత్వం పైనే తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడిది సంచలనంగా మారింది.

తనను నిలదీస్తే.. ప్రభుత్వాన్నే నిలదీస్తానని మాణిక్యాలరావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనను కట్ చేస్తే.. ఏపీనే కట్ చేస్తానంటూ ఊగిపోయారు. తాడెపల్లి గూడెం నియోజకవర్గాన్ని కేంద్రం నిధులతోనే అభివృద్ధి చేశానని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. నిధులను, తనను అడ్డుకోవాలని చూస్తే మగాడినై రెచ్చిపోతానంటూ రెచ్చిపోయిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వాన్ని నిలదీయడం, నిధుల విషయంలో చేసిన కామెంట్లు పక్కన పెడితే ఎంత కండకావరం ఉంటే రాష్ట్రాన్నే కట్ చేస్తా అంటారు? అసలు ఏం చూసుకుని రాష్ట్ర బీజేపీ నాయకులకు ఇంతటి బలుపో అర్ధం కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నాం కదా అని రాష్ట్రంపై ఇటు వంటి కామెంట్లు చేస్తే ప్రజలే బుద్ది చెప్పే టైమ్ వస్తుంది.