Looks as lively as Bangalore Daysమలయాళంలో సూపర్ హిట్ అయిన “బెంగళూర్ డేస్” సినిమాను ప్రముఖ సంస్థ పివిపి రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు ఆర్య, రానా, సమంత, శ్రీ దివ్య, బాబీ సింహ, పార్వతిలు నటిస్తున్నారు.

‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’ చెబుతూ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థ పివిపి విడుదల చేసింది. పూలతో శ్రీదివ్యను కొడుతూ కలర్ ఫుల్ గా ఉన్న ఈ పోస్టర్ చూపరులను ఆకట్టుకుంటోంది. అలాగే ‘మోషన్ పిక్చర్’ను కూడా ఈ సందర్భంగా విడుదల చేసారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ సినిమా ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.